మరింత స్టైలిష్ గా అల్లు అర్జున్ వర్క్: తన కొడుకు అయాన్ తో చిన్నారి అభిమానికి ఆటోగ్రాఫ్, అనాధాశ్రమంలో పండుగ

|

Dec 25, 2020 | 3:47 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రిస్మస్ పర్వదినాన మరింత స్టైలిష్ గా ఒక పనిచేశాడు. అభిమాని కోసం తన ఆటోగ్రాఫ్ ను పంపిన అల్లు అర్జున్‌,..

మరింత స్టైలిష్ గా అల్లు అర్జున్ వర్క్: తన కొడుకు అయాన్ తో చిన్నారి అభిమానికి ఆటోగ్రాఫ్, అనాధాశ్రమంలో పండుగ
Follow us on

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రిస్మస్ పర్వదినాన మరింత స్టైలిష్ గా ఒక పనిచేశాడు. అభిమాని కోసం తన ఆటోగ్రాఫ్ ను పంపిన అల్లు అర్జున్‌, ఆ చిన్నారి కోరిక తీర్చాడు. అయితే, విశేషమేమిటంటే, ఆ చిన్నారిని కలిసి బన్నీ ఆటోగ్రాఫ్‌ను ఇచ్చింది బన్నీ తనయుడు అయాన్‌. అంతేకాదు, అల్లువారి మనువడు అయాన్.. ఆ చిన్నారులతో కలిసి క్రిస్టమస్‌ పండుగ కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. అనాధాశ్రమంలోని చిన్నారులకు గిఫ్ట్స్ ఇచ్చాడు. వితికా షేర్(హీరో వరుణ్ సందేశ్ భార్య) విజ్ఞప్తితో బుడ్డి అభిమాని కోరికని ఇలా తన కొడుకు ద్వారా తీర్చాడు స్టైలిష్ స్టార్.