Alibaba Founder Jack Ma: ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా అదృశ్యం… రెండు నెలలుగా కనపడని వైనం…

| Edited By:

Jan 05, 2021 | 1:34 PM

ఆలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా కనిపించకుండా పోవడం కార్పొరేట్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అయితే జాక్ మా అదృశ్యం వెనక చైనా దేశ ప్రభుత్వ ప్రమేయం...

Alibaba Founder Jack Ma: ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా అదృశ్యం... రెండు నెలలుగా కనపడని వైనం...
Follow us on

Alibaba Founder Jack Ma: ఆలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా కనిపించకుండా పోవడం కార్పొరేట్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అయితే జాక్ మా అదృశ్యం వెనక చైనా దేశ ప్రభుత్వ ప్రమేయం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు పెట్టుకునే పాన్‌ షాపులుగా మాత్రమే ఉంటున్నాయే తప్ప వినూత్నంగా వ్యవహరించడం లేదంటూ ఓ ఉపన్యాసం సందర్భంగా మా అక్టోబర్‌లో వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. వ్యాపారపరంగా నవకల్పనల గొంతు నొక్కేసేలా ఉన్న విధానాలను సంస్కరించాలని ఆయన వ్యాఖ్యానించడం చైనా సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. అక్కణ్నుంచి జాక్‌ మాకు వేధింపులు మొదలయ్యాయి. ఆయనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మాకు అక్షింతలు వేయడమే కాకుండా జాక్‌ మాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ ఐపీవో (37 బిలియన్‌ డాలర్లు)నూ నిలిపేసింది. ఆలీబాబా గ్రూప్‌ గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది. చైనాను విడిచిపెట్టి వెళ్లొద్దంటూ జాక్‌ను ఆదేశించింది.

బలం చేకూరిందిలా…

జాక్ మా తాను నిర్వహించే టాలెంట్‌ షో ‘ఆఫ్రికాస్‌ బిజినెస్‌ హీరోస్‌’ కార్యక్రమం తుది ఎపిసోడ్‌లో ఆయన న్యాయనిర్ణేతగా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ హాజరు కాకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఆ షోకు హాజరు కాకపోవడం, షో వెబ్‌సైట్‌ నుంచి ఆయన ఫొటోలను కూడా తొలగించడం వంటి అంశాలన్నీ చూస్తే దీని వెనుక చైనా ప్రభుత్వం హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా జాక్ మా రెండు నెలలుగా ఎటువంటి కార్యక్రమాల్లో, ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

 

Also Read: HCL Acquisition Of DWS: ఆస్ట్రేలియా కంపెనీని కొనుగోలు చేసిన భారత్‌ టెక్‌ దిగ్గజం.. ఈ డీల్‌ విలువ ఎంతంటే..