ఉగ్రవాదులు నక్కి ఉన్నారు: అమర్‌నాథ్‌ యాత్రపై హైఅలర్ట్

| Edited By:

Jun 28, 2019 | 8:08 PM

ప్రఖ్యాత అమర్‌నాథ్ యాత్రలోని యాత్రికులే లక్ష్యంగా దాడులు చేసేందుకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా బల్తాల్ రూట్ ద్వారా వెళ్లే యాత్రికులను వారు టార్గెట్ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని గందేర్బల్, కంగన్ పర్వత ప్రాంతాల్లో నక్కి ఉన్న ఉగ్రవాదులు.. యాత్రికులపై దాడులు చేయాలని పథకాలు రచిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. యాత్ర సాగే మార్గం వెంబడి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. […]

ఉగ్రవాదులు నక్కి ఉన్నారు: అమర్‌నాథ్‌ యాత్రపై హైఅలర్ట్
Follow us on

ప్రఖ్యాత అమర్‌నాథ్ యాత్రలోని యాత్రికులే లక్ష్యంగా దాడులు చేసేందుకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా బల్తాల్ రూట్ ద్వారా వెళ్లే యాత్రికులను వారు టార్గెట్ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని గందేర్బల్, కంగన్ పర్వత ప్రాంతాల్లో నక్కి ఉన్న ఉగ్రవాదులు.. యాత్రికులపై దాడులు చేయాలని పథకాలు రచిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి.

యాత్ర సాగే మార్గం వెంబడి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనే యాత్రికుల భద్రత దృష్ట్యా వారి కదలికలను తెలుసుకునేందుకు ఉపకరించే బార్‌కోడ్ ఆధారిత స్లిప్‌లను జారీ చేయనున్నారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో భద్రతా అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా యాత్రికుల భద్రతను పెంచేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా జూలై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.