దివాళీ బొనాంజా..ఐసిస్‌కు కాబోయే నేతను ఖతం చేసిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికా టెర్రరిస్టుల అణిచివేత దిశగా పలు కీలక దాడులతో దుమ్మురేపుతోంది. తాజాగా ఐసిస్‌ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అగ్ర నేత అబుబకర్‌-అల్‌-బాగ్దాదీని అమెరికా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఐసిస్‌కు మరో కోలుకోలేని షాకింగ్ న్యూస్‌ని తాజాగా అగ్రరాజ్యం వెల్లడించింది.  బాగ్దాదీ తర్వాత ఐసిస్‌కు నాయకత్వం వహించబోయే ఉగ్రవాదిని కూడా హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. మంగళవారమే ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు పేర్కొన్నారు. బాగ్దాదీని అంతమొందించిన మూడు రోజుల వ్యవధిలోనే ఐసిస్‌ […]

  • Ram Naramaneni
  • Publish Date - 10:38 pm, Tue, 29 October 19
దివాళీ బొనాంజా..ఐసిస్‌కు కాబోయే నేతను ఖతం చేసిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికా టెర్రరిస్టుల అణిచివేత దిశగా పలు కీలక దాడులతో దుమ్మురేపుతోంది. తాజాగా ఐసిస్‌ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అగ్ర నేత అబుబకర్‌-అల్‌-బాగ్దాదీని అమెరికా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఐసిస్‌కు మరో కోలుకోలేని షాకింగ్ న్యూస్‌ని తాజాగా అగ్రరాజ్యం వెల్లడించింది.  బాగ్దాదీ తర్వాత ఐసిస్‌కు నాయకత్వం వహించబోయే ఉగ్రవాదిని కూడా హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. మంగళవారమే ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు పేర్కొన్నారు. బాగ్దాదీని అంతమొందించిన మూడు రోజుల వ్యవధిలోనే ఐసిస్‌ అగ్రనేత స్థానాన్ని భర్తీ చేయబోయే ఉగ్రవాదిని మట్టుబెట్టామని ట్రంప్‌ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.