
Ajinkya Rahane Comments: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రహనే కారణంగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆ రనౌట్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు జరిగిన తన తప్పిదంపై అజింక్య రహనే తాజాగా స్పందించాడు. ”ఆ రోజు మ్యాచ్ జరిగిన తర్వాత కోహ్లీకి క్షమాపణలు చెప్పాను.
రనౌట్ అయిన పరిస్థితిని అతడు అర్ధం చేసుకున్నాడు” అని రహనే చెప్పుకొచ్చాడు. క్రికెట్‌లో ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయని.. వాటిని గౌరవిస్తూ ముందుకు సాగాలని అన్నాడు. కాగా, రేపట్నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రహనే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మొదటి టెస్టు ఘోర వైఫల్యాన్ని మర్చిపోయేలా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read:
Bigg Boss 4: మెహబూబ్ సైగలపై స్పందించిన అభిజిత్.. ‘స్టార్ మా’ తేల్చాలంటూ ఆసక్తికర కామెంట్స్.!
కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!
ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!
షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!