కర్ణాటకలోని మంగళూరులో కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ‘అగ్నికేళీ’ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఏటా ఆలయంలో 8 రోజులపాటు పరమేశ్వరి ఉత్సవం నిర్వహిస్తారు. ఏటా జరిగే వేడుకల్లో భాగంగా పండుగ రెండో రోజైన ఆదివారం రాత్రి ముఖ్యమైన అగ్నికేళీ ఉత్సవం జరిగింది. ఇందులో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఏళ్ల నాటి ఆచారాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కాగడాలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆనందంగా అగ్నికేళీ ఉత్సవంలో పాల్గొన్నారు.