మరోసారి పేలిన బాయిలర్.. ఒకరి మృతి

నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

మరోసారి పేలిన బాయిలర్.. ఒకరి మృతి

Updated on: Aug 06, 2020 | 12:13 PM

నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా బాయిలర్ హీటర్ పేలి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని నంధ్యాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దక్షిణామూర్తి అనే కార్మికుడు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇటీవలే ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మెయిన్ టెనెన్స్ వర్క్స్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జనరల్ మేనేజర్ మృతిచెందారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఓ కమీటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ ఘటన మరువకముందే మళ్లీ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us