Adipurush director: ప్రభాస్‌ ఒప్పుకోకపోతే ఆదిపురుష్‌ సినిమాను చేసేవాడినే కాదు: ఓం రౌత్‌

Adipurush director About Prabhas: 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా నేషనల్‌ స్టార్‌గా మారాడు హీరో ప్రభాస్‌. ఈ సినిమా విజయంతో ప్రభాస్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది...

Adipurush director: ప్రభాస్‌ ఒప్పుకోకపోతే ఆదిపురుష్‌ సినిమాను చేసేవాడినే కాదు: ఓం రౌత్‌

Updated on: Jan 06, 2021 | 1:13 PM

Adipurush director About Prabhas: ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా నేషనల్‌ స్టార్‌గా మారాడు హీరో ప్రభాస్‌. ఈ సినిమా విజయంతో ప్రభాస్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. కేవలం భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ బాహుబలి విడుదల కావడంతో ప్రభాస్‌ పేరు ఖండాంతరాలు కూడా దాటింది.
ఇక ప్రభాస్‌తో సినిమా చేయడానికి బాలీవుడ్‌ దర్శకులు కూడా క్యూ కట్టే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌ ప్రభాస్‌తో ‘ఆదిపురుష్‌’ సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. మైథలాజికల్‌ వండర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నాడు. పాన్‌ ఇండియా నేపథ్యంగా రానున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ అగ్ర తారలు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర దర్శకుడు ఓం రౌత్‌.. చేసిన వ్యాఖ్యలు ప్రభాస్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓం రౌత్‌ మాట్లాడుతూ.. ప్రభాస్‌ అనే వ్యక్తి లేకపోతే అసలు ఆది పురుష్‌ సినిమా ఉండేది కాదని చెప్పాడు. ఒక వేళ ప్రభాస్‌ ఈ సినిమాకు ఒప్పుకొని ఉండకపోతే నేను ఈ సినిమాను ప్రారంభించేవాడిని కాదంటూ యంగ్‌ రెబల్‌ స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఒక బాలీవుడ్ దర్శకుడు తమ హీరోను ఇంతలా పొగడడంతో డార్లింగ్‌ అభిమానుల సంతోషానికి అంతే లేకుండా పోతోంది.

Also Read: Banita Sandhu tests positive : కరోనా బారిన పడిన మరో హీరోయిన్.. ఇటీవలే యూకే నుంచి వచ్చిన బ్యూటీ