యువ నటుడికి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..

|

Oct 07, 2020 | 4:17 PM

ప్రముఖ మలయాళ నటుడు, ఫోరెన్సిక్ ఫేమ్ టోవినో థామస్‌ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. 'కాలా' సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరగగా.. అందులో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

యువ నటుడికి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..
Follow us on

Actor Tovino Thomas hospitalised: ప్రముఖ మలయాళ నటుడు, ఫోరెన్సిక్ ఫేమ్ టోవినో థామస్‌ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ‘కాలా’ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరగగా.. అందులో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. యాక్షన్ సీన్‌ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ థామస్‌కు ఇంటర్నల్‌ బ్లీడింగ్ కావటంతో ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం ఆయనకు కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతని కడుపులో బలంగా దెబ్బ తగలటంతో ఇంటర్నల్‌ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. టోవినో థామస్‌కు ప్రమాదం జరిగిన వార్త వైరల్ కావడంతో.. ఆయనకు అభిమానులు సోషల్‌ మీడియా వేదిక త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా, టోవినో థామస్‌కు మాలీవుడ్‌లో హీరోగా, విలన్‌గా ఎంతో గుర్తింపు ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇటీవల థామస్ నటించి ‘ఫోరెన్సిక్’ సినిమా తెలుగులోనూ ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Also Read:

ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.!

అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. దరఖాస్తుకు మరోసారి అవకాశం.!

అఫీషియల్: అక్టోబర్ 30న కాజల్- గౌతమ్‌ల పెళ్లి..

అక్టోబర్ 15న సినిమా థియేటర్ల రీ-ఓపెన్.. మార్గదర్శకాలు జారీ..

బిగ్ బాస్: అభిజిత్ సారీ చెప్పాడు.. మోనాల్ అఖిల్‌కు హగ్ ఇచ్చింది!

సన్‌రైజర్స్ జట్టులోకి తెలుగు తేజం.. భువనేశ్వర్ స్థానంలో..