
తన కుమారుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకోవడానికి నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులతో బాటు మరో ఆరుగురు కారణమంటూ సుశాంత్ తండ్రి కె.కె.సింగ్ పాట్నాలో పోలీసు కేసు పెట్టారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా వీరంతా ప్రేరేపించారని ఆయన ఆరోపించారు. అయితే ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేసేలా చూడాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కేసును ముంబై పోలీసులు ఇదివరకే విచారిస్తున్నారని, తనతో సహా మరికొందరు వారికి వాంగ్మూలం కూడా ఇచ్చామని ఆమె కోర్టుకు తెలిపారు. ఒకే ఘటనపై రెండు ఇన్వెస్టిగేషన్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. విచారణలో ముంబై పోలీసులకు తను సహకకరిస్తూనే ఉన్నానన్నారు.
తన క్లయింటు వాదనను సుప్రీంకోర్టు ఆలకించేంతవరకు బీహార్ పోలీసులు ఆమెపై పెట్టిన ఎఫ్ ఐ ఆర్ విచారణను నిలిపివేసేలా చూడాలని రియా చక్రవర్తి తరఫు లాయర్ సతీష్ మాన్ షిండే అత్యు న్నత న్యాయస్థానాన్ని కోరారు. కాగా-తన కుమారుడు సుశాంత్ తో రిలేషన్ షిప్ లో ఉన్న రియా చక్రవర్తి.. అతడి నుంచి డబ్బులు గుంజి ఛీట్ చేసిందని, అతడికి కావాలనే దూరమైందని సుశాంత్ తండ్రి ఆరోపిస్తున్నారు.