టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ‘రోగ్’ సినిమా చాలా మందికి గుర్తుండకపోవచ్చు. ఈ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. 2017 లో వచ్చిన ఈ సినిమా భారీ ఫ్లాప్ ను అందుకుంది. ఈ సినిమాలో బెంగళూరుకు చెందిన ఇషాన్ హీరోగా నటించాడు. తెలుగు,కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా రెండు చోట్లా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఈ కుర్ర హీరో జాడలేకుండా పోయాడు. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత తన సెకండ్ సినిమాను అనౌన్స్ చేసాడు. పవన్ వడేయార్ దర్శకత్వంలో ఇషాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా తెలుగు,కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.ఈ సినిమాకు’రైమో’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఇషాన్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాను ఇషాన్ తండ్రి సీఆర్ మనోహర్ నిర్మించబోతున్నాడు.మరి ఈ సినిమాతోనైనా ఈ కుర్రహీరో హిట్ అందుకుంటాడేమో చూడాలి.