Brahma Ji House : భారీగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. చాలా ప్రాంతాలు వర్షం నీటిలో తడిసి ముద్ధవుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగర వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు, ఇళ్లు జలమయమయ్యాయి. ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం సోమవారం మళ్లీ ముంచేసింది. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలావుంటే తన ఇంటి పరిస్థితి ఇదంటూ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోమవారం సోషల్‌మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశారు. ఆయన ఇంటి ఆవరణలో భారీగా వరద నీరు చేరింది. కాలనీ మొత్తం జలదిగ్భందంలో చిక్కుకుంది. ‘మోటర్ బోట్ కొనాలనుకుంటున్నా.. ఏది బాగుంటుందో సలహా ఇవ్వండి’ అంటూ సెటైర్‌ను సందించాడు తమ మరో ట్వీట్ చేశారు. దీనికి ఆయన ఫాలోవర్స్ ఫన్నీ కామెంట్లు చేశారు.
బ్రహ్మాజీ ఇంటి ఫొటోలు చూసిన నెటిజన్లు తెగ స్పందించారు. ‘అయ్యో.. పడవ కొనాలి అన్నా, మీకు ఈత వస్తే ఫర్వాలేదు, వర్షాలు ఇంకా వస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. చిరునామా చెప్పు అన్నా.. బోట్ వేసుకుని వచ్చేస్తా..’ అంటూ రకరకాల కామెంట్లు చేశారు. బ్రహ్మాజీ గత కొన్ని రోజులుగా ‘అల్లుడు అదుర్స్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. సోనూసూద్, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నభా నటేష్ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ శంషాబాద్‌లో జరుగుతోందని రెండు రోజుల క్రితం బ్రహ్మాజీ చెప్పారు.