కాలేజీల ప్రకటనపై AICTE కీలక ప్రకటన.. డిసెంబర్ 1 నుంచి ఫ్రెషర్లకు క్లాసులు.!

దేశంలోని ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక కోర్సుల్లో చేరే మొదటి సంవత్సరం విద్యార్థులకు డిసెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభించాలని ఏఐసీటీఈ నిర్ణయించింది.

కాలేజీల ప్రకటనపై AICTE కీలక ప్రకటన.. డిసెంబర్ 1 నుంచి ఫ్రెషర్లకు క్లాసులు.!

Updated on: Oct 20, 2020 | 9:36 AM

Academic Year December 1: కరోనా వైరస్ కారణంగా ఆలస్యమైన విద్యా సంవత్సరాన్ని పున: ప్రారంభించేందుకు ఇటీవలే యూజీసీ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక కోర్సుల్లో చేరే మొదటి సంవత్సరం విద్యార్థులకు డిసెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) నిర్ణయించింది. అలాగే అడ్మిషన్ల ప్రక్రియను కూడా నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్ధనల మేరకు ప్రవేశాల డెడ్ లైన్‌ను పొడిగించామని ఏఐసీటీఈ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇక స్థానిక కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 1వ తేదీ నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభించవచ్చని తెలిపారు. కాగా, కోవిడ్ కారణంగా మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, స్కూళ్లు మూతపడిన సంగతి విదితమే.

Also Read:

హెచ్చరిక: మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షాలు.!

వరద బాధితులకు బాసటగా జగన్ సర్కార్.. ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ..