Air Conditioner: వేసవిలో ఏసీలు కొనేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. భారీగా పెరగనున్న ధరలు.. తప్పదంటున్న కంపెనీలు..!

|

Mar 15, 2021 | 7:43 AM

Air Conditioner: వేసవి కాలం వచ్చిందంటే చాలు ఏసీల కింద సేద తీరాలనుకుంటారు. కానీ ఈ ఏడాది ఏసీ ధరలు మండిపోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏసీలో...

1 / 5
Air Conditioner: వేసవి కాలం వచ్చిందంటే చాలు ఏసీల కింద సేద తీరాలనుకుంటారు. కానీ ఈ ఏడాది ఏసీ ధరలు మండిపోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏసీలో ఉపయోగించే ధరలు పెరగడం వల్ల ఈ ఏడాది ఏసీల ధరలు దాదాపు 5 నుంచి 8 శాతం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ధరలు పెంచినా ఈ ఏడాది ఏసీల విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధిస్తామన్న విశ్వాసం కంపెనీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

2 / 5
గత రెండు, మూడు నెలల కాలంలోనే విక్రయాల్లో 25 శాతం వృద్ధి నమోదైనట్లు ఆయా ఏసీ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. మొత్తం మీద ఏసీల తయారీపై 10 నుంచి 12 శాతం భారం పడినా తొలి విడతల్లో 5 నుంచి 6 శాతం మేర ధరలు పెంచామని, ఏప్రిల్‌లో మరో 5 నుంచి 6 శాతం పెరగవచ్చని ఎలక్ట్రానిక్స్‌, అప్లయెన్సెస్‌ తయారీదారుల సంఘం చెబుతోంది.

3 / 5
ఈ ఏడాది ఏసీల విక్రయాల్లో 20 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఏసీల తయారీలో ఉపయోగించే కొన్ని మెటల్స్‌, కంప్రెసర్ల ధర పెరగడం వల్ల ధరలు పెంచక తప్పదనే అభిప్రాయం పలు కంపెనీల నుంచి వ్యక్తం అవుతోంది. తాము ఈ సారి ఏసీల ధరలు 3 నుంచి 5శాతం పెంచాలనుకున్నట్లు దైకిన్‌ సీఈవో కన్వల్‌జీత్‌ జవా వెల్లడించారు. విక్రయాలపై ఈ పెంపు ప్రభావం కొంత పడుతుందని ఆయన అన్నారు.

4 / 5
అలాగే ఏసీల ధరల్లో 6 నుంచి 8శాతం పెంచాలనుకుంటున్నట్లు పానాసోనిక్‌ సీఈఓ మనీష్‌ శర్మ తెలిపారు. కాగా, ఏసీల విభాగంలో అగ్రగామి కంపెనీల్లో ఒకటైన టాటా గ్రూప్‌ కంపెనీ వోల్టాస్‌ ఇప్పటికే అన్ని రకాల ఏసీల ధరలు పెంచేసింది. తాము ఇప్పటికే ఏసీల ధర 5 నుంచి 8 శాతం పెంచినా ఏప్రిల్‌లో మరో 3 శాతం వరకు పెంచే ఆస్కారం ఉన్నట్లు పేర్కొంటున్నారు.

5 / 5
కాగా, కరోనా సంక్షోభం కారణంగా చాలా మంది వర్క్‌ ఫ్రంహోం చేస్తున్నారని, జనం కూడా ఎక్కువగా ఇళ్లకే పరిమితం అవుతున్నారని అన్నారు. అయితే విక్రయాల్లో 40 నుంచి 45శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు ఎల్‌జీ కంపెనీ చెబుతోంది.