
ఏబీవీపీ నాయకుడు, ఆంకాలజిస్ట్ కూడా అయిన సుబ్బయ్య షణ్ముగం అనే డాక్టర్ ను కేంద్రం మదురైలోని ఎయిమ్స్ బోర్డు సభ్యునిగా నియమించింది. కొన్ని నెలల క్రితం ఇతగాడు చెన్నైలో ఓ వృధ్ద మహిళ ఇంటివద్ద మూత్ర విసర్జన చేశాడని, ఆమెను వేధించాడని, వాడేసిన మాస్కులను ఆమె ఇంటి తలుపు వద్ద పడేశాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. కానీ వీటిని పక్కనపెట్టి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా ఈ నియామకం చేసింది. చెన్నైలోని ఓ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో సర్జికల్ ఆంకాలజి విభాగం హెడ్ అయిన సుబ్బయ్య గారు యధాప్రకారం తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేశాడు. తన వృత్తిగతమైన అర్హత ఆధారంగా ఎయిమ్స్ బోర్డులో సభ్యునిగా నియమించారని పేర్కొన్నాడు.