చర్చలు సఫలం..అందుబాటులోకి ఆరోగ్యశ్రీ సేవలు

|

Aug 21, 2019 | 3:59 AM

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని..ఇకపై ప్రతి నెలా ఆరోగ్యశ్రీ సేవల చెల్లింపులను జరుపుతామని తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. అంతేకాదు ఆరోగ్యశ్రీ ఎంఓయూకు సవరణకు కమిటీని నియమిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రైవేట్ ఆస్పత్రులు సమ్మె […]

చర్చలు సఫలం..అందుబాటులోకి ఆరోగ్యశ్రీ సేవలు
Follow us on

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని..ఇకపై ప్రతి నెలా ఆరోగ్యశ్రీ సేవల చెల్లింపులను జరుపుతామని తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. అంతేకాదు ఆరోగ్యశ్రీ ఎంఓయూకు సవరణకు కమిటీని నియమిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రైవేట్ ఆస్పత్రులు సమ్మె విరమించడంతో రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు తక్షణమే అందుబాటులోకి వచ్చాయి.