ఢిల్లీలో ఆప్ నేత ఆధ్వర్యంలోని జలమండలి ఆఫీసుపై బీజేపీ కార్యకర్తల దాడి, విధ్వంసం , రైతుల నిరసనకు మద్దతు తెలిపినందుకట

ఢిల్లీలో ఆప్ నేత  రాఘవ ఛధ్ధా వైస్-చైర్మన్ గా ఉన్న ఢిల్లీ జల మండలి కార్యాలయంపై గురువారం బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. రైతుల ఆందోళనకు మద్దతునిస్తునందుకు ఆగ్రహంతో..

ఢిల్లీలో ఆప్ నేత ఆధ్వర్యంలోని జలమండలి ఆఫీసుపై బీజేపీ కార్యకర్తల దాడి,  విధ్వంసం , రైతుల నిరసనకు మద్దతు తెలిపినందుకట

Edited By:

Updated on: Dec 24, 2020 | 7:47 PM

ఢిల్లీలో ఆప్ నేత  రాఘవ ఛధ్ధా వైస్-చైర్మన్ గా ఉన్న ఢిల్లీ జల మండలి కార్యాలయంపై గురువారం బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. రైతుల ఆందోళనకు మద్దతునిస్తునందుకు ఆగ్రహంతో ఈ ఎటాక్ కు దిగారని ఛధ్ధా ఆ తరువాత తెలిపారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ..మద్దతునిస్తున్నారని, తక్షణమే ఈ వైఖరి మానుకోవాలని వారు హెచ్ఛరించినట్టు ఆయన చెప్పారు. ఈ దాడి తాలూకు వీడియోను ఆయన విడుదల చేశారు .నగర బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఆధ్వర్యాన ఈ పార్టీ కార్యకర్తలు ఉదయం 11 గంటల నుంచి ఆందోళనకు దిగారు. అయితే ఇలాంటి దాడులకు భయపడబోమని, తాము, తమ పార్టీ రైతుల వెంటే ఉంటామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తమ ఆప్ కార్యకర్తలు ప్రతీకారానికి దిగరాదని ఆయన కోరారు. ఇటీవలే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడికి దిగిన సంగతి విదితమే.. ఆయన కుటుంబ సభ్యులను వారు బెదిరించినట్టు కూడా వార్తలు వచ్చాయి.