కరోనా లాక్‌డౌన్‌: రేష‌న్ కార్డుతో ఆధార్ లింక్ గ‌డువు పెంపు..

| Edited By:

May 12, 2020 | 3:55 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే.. రేష‌న్ కార్డును ఆధార్ నంబ‌ర్ తో లింక్ చేయ‌లేద‌న్న

కరోనా లాక్‌డౌన్‌: రేష‌న్ కార్డుతో ఆధార్ లింక్ గ‌డువు పెంపు..
Follow us on

Aadhaar card ration card linking: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే.. రేష‌న్ కార్డును ఆధార్ నంబ‌ర్ తో లింక్ చేయ‌లేద‌న్న కార‌ణంగా ఎక్క‌డా ఏ ఒక్క‌రికీ రేష‌న్ స‌రుకుల స‌ర‌ఫ‌రా నిలిపేయొద్ద‌ని కేంద్రం ఆదేశించింది. ఆధార్ సీడింగ్ గ‌డువును ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు సోమ‌వారం ప్ర‌క‌టించింది.

కాగా.. అప్ప‌టి వ‌ర‌కు ఆధార్ కార్డు లేద‌ని గానీ, ఆధార్ లింక్ చేయ‌లేద‌ని గానీ ఎవ‌రి పేర్ల‌ను రేష‌న్ కార్డు నుంచి తొల‌గించొద్ద‌ని సూచించింది. అలాగే నేష‌న‌ల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్ర‌కారం దేశంలో ప్ర‌తి ఒక్క‌రికీ ఆహార భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, ఎవ‌రికైనా బ‌యోమెట్రిక్ మెషీన్ల‌లో వేలి ముద్ర స‌రిగా ప‌డ‌లేద‌ని రేష‌న్ ఇవ్వ‌కుండా ఆప‌డం లాంటివి జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది కేంద్రం. అర్హులైన‌ ఏ ఒక్క‌రికి కూడా రేష‌న్ నిరాక‌రించొద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది.

మరోవైపు.. దేశ వ్యాప్తంగా 23.5 కోట్ల రేష‌న్ కార్డులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఆధార్ సీడింగ్ పూర్త‌యిన వారికి వ‌న్ నేష‌న్ – వ‌న్ రేష‌న్ విధానంలో ఇంట‌ర్ స్టేట్ పోర్ట‌బులిటీని అమ‌లు చేస్తూ ఏ రాష్ట్రంలోనైనా రేష‌న్ స‌రుకులు తీసుకునేలా అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. దీని ద్వారా ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన వారికి ల‌బ్ధి చేకూరుతోంద‌ని తెలిపింది.