కిచెన్‌లోనో, బాత్రూమ్‌లోనో కుళాయి ట్యాప్ తిప్పితే నీళ్లు రావడం సహజం. అదే రెడ్ వైన్ వస్తే..ఆశ్చర్యం కలగకుండా ఉంటుందా..?. ఇటీవల ఇటలీలోని ఓ ప్రాంత ప్రజలు అటువంటి అనుభూతినే ఫేస్ చేశారు. అసలు వైన్ ఎందుకు వస్తుందనే విషయాన్ని వదిలేసి..బాటిళ్లలో, డ్రంబులలో వైన్ స్టోర్ చేసి పెట్టుకున్నారు.
ఇంతకీ వైన్ ఎలా వచ్చిందనేగా మీ డౌబ్ట్. వాటర్ సప్లై చేసే పైప్‌లైన్ ఉన్న రూట్‌లోనే వైన్ కంపెనీకి చెందిన పైప్‌లైన్ కూడా ఉంది. మోడెనాకు దక్షిణంగా ఉన్న కాంటినా సెట్టెకానీ వైనరీ వద్ద వైన్ పైప్‌లైన్ వాల్వ్ పనిచేయకపోవడం వల్ల లాంబ్రస్కో గ్రాస్పరోస్సా అనే మెరిసే ఎరుపు వైన్ కాస్టెల్వెట్రో టౌన్ నీటి వ్యవస్థలోకి ప్రవేశించింది. అది కూడా బాటిల్స్ నింపడానికి సిద్దంగా ఉన్న వైన్. వైన్ లీక్ అయిన విషయం తెలియడంతో, నీటి సరఫరా నిలిపివేశారు. గత బుధవారం 3 గంటల సేపు 20 ఇళ్లకి వైన్ ప్రవహించింది. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి..వైన్ ప్రవాహాన్ని నిలిపివేశారు. స్థానిక ప్రభుత్వం తన ఫేస్‌బుక్ పేజీలో ఈ లీక్ వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదాలు జరగలేదని పోస్ట్ చేసింది.
KBL Kazi kwenu…..
Red wine flows from water taps in Italian village after a technical fault at a local winery! pic.twitter.com/rFNEFqBwP9— KO3CH™ (@TheBryo) March 7, 2020