యూపీలో హత్రాస్ ఘటన ఇంకా మరువక ముందే మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని భదోహి జిల్లాలో 14 ఏళ్ళ బాలికను దుండగులు రాళ్లు, ఇటుకరాళ్ళతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారం కూడా జరిగి ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు. బడుగు వర్గాలకు చెందిన ఈ బాధితురాలిని ఎందుకు హతమార్చారో తెలియడంలేదని వారంటున్నారు. ఈ వరుస అమానుష ఘటనలతో యూపీ రాష్ట్రం హీటెక్కుతోంది. ఇలాంటి దారుణాలపై స్పందించకుండా చోద్యం చూస్తున్న యోగి ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి.