యూపీ సీఎం కసి.. జర్నలిస్ట్ అరెస్ట్.. సుప్రీం ఏం చెబుతుందో ?

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఓ వీడియోను షేర్ చేశాడన్న ఆరోపణపై ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో బాటు మరో ఐదుగురిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. తనను వెంటనే విడుదల చేసేలా చూడాలంటూ ప్రశాంత్ కనోజియా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది. తన భర్త అరెస్టు అక్రమమని, ఆయనను అరెస్టు చేసిన ఖాకీలు సరైన ప్రొసీజర్ ను […]

యూపీ సీఎం కసి.. జర్నలిస్ట్ అరెస్ట్.. సుప్రీం ఏం చెబుతుందో ?
Follow us

|

Updated on: Jun 10, 2019 | 4:09 PM

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఓ వీడియోను షేర్ చేశాడన్న ఆరోపణపై ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో బాటు మరో ఐదుగురిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. తనను వెంటనే విడుదల చేసేలా చూడాలంటూ ప్రశాంత్ కనోజియా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది. తన భర్త అరెస్టు అక్రమమని, ఆయనను అరెస్టు చేసిన ఖాకీలు సరైన ప్రొసీజర్ ను పాటించలేదని ప్రశాంత్ భార్య జగదీశ్ అరోరా ఆరోపించింది. అటు తన క్లయింటుపై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ ఐ ఆర్ చట్ట విరుధ్ధమని, పైగా వారు వారంట్ కూడా జారీ చేయలేదని ప్రశాంత్ తరఫు లాయర్ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. నోయిడా లోని ఓ టీవీ ఛానల్ హెడ్ అయిన ప్రశాంత్ కనోజియా ప్రసారం చేసిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. దేశంలో భావ ప్రకటనా స్వాతంత్య్రం అంటే ఇదేనా అని పలువురు ప్రశ్నించారు. కనోజియాతో బాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం బయట ఓ మహిళ రిపోర్టర్లతో మాట్లాడుతూ..తాను ఓ పెళ్లి ప్రపోజల్ ను ఆయనకు పంపానని ప్రకటించిన విషయాన్ని ప్రశాంత్ వీడియోగా ప్రసారం చేయగా అది పెద్ద రచ్చఅయింది. యోగి కార్యాలయ వర్గాలు ఈ వీడియో పట్ల అభ్యంతరం ప్రకటించాయి. యోగి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లక్నో జైల్లో ఉన్న ప్రశాంత్ కనోజియా తన విడుదల పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.