ఏపీలో తొలిరోజు మద్యం విక్రయాలు ఎంతంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లిక్కర్ షాపులు తిరిగి పునః ప్రారంభం అవ్వ‌డంతో మందుబాబులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఇన్ని రోజులు మ‌న‌సు చంపుకోని దాచుకున్న మందు కోరిక‌ను ఎండ‌లో భారీ క్యూ లైన్ల‌లో నిల్చుని మ‌రీ తీర్చుకున్నారు. సోమవారం రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. ప్రతి షాపు వద్ద తిరునాళ్ల వాతావరణం కనిపించింది. మద్యంలేక పిడ‌స క‌ట్టుకుపోయిన‌ నాలుక తడుపుకునేందుకు మందు బాబులు పోటీ పడ్డారు. ఫలితంగా తొలిరోజు రికార్డు లెవ‌ల్ లో మ‌ద్యం విక్ర‌యాలు జ‌రిగాయి. లాక్​డౌన్​ […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:33 pm, Mon, 4 May 20
ఏపీలో తొలిరోజు మద్యం విక్రయాలు ఎంతంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లిక్కర్ షాపులు తిరిగి పునః ప్రారంభం అవ్వ‌డంతో మందుబాబులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఇన్ని రోజులు మ‌న‌సు చంపుకోని దాచుకున్న మందు కోరిక‌ను ఎండ‌లో భారీ క్యూ లైన్ల‌లో నిల్చుని మ‌రీ తీర్చుకున్నారు. సోమవారం రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. ప్రతి షాపు వద్ద తిరునాళ్ల వాతావరణం కనిపించింది. మద్యంలేక పిడ‌స క‌ట్టుకుపోయిన‌ నాలుక తడుపుకునేందుకు మందు బాబులు పోటీ పడ్డారు. ఫలితంగా తొలిరోజు రికార్డు లెవ‌ల్ లో మ‌ద్యం విక్ర‌యాలు జ‌రిగాయి.

లాక్​డౌన్​ సడలింపులతో నేప‌థ్యంలో మొత్తం 3,468 అధికారిక మద్యం షాపులకుగాను 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ‌గా 411 మద్యం షాపుల విక్ర‌యాలు ప్రారంభించాయి. ప్రకాశం జిల్లాలో మాత్రం ఒక్క షాపు తెరుచుకోలేదు. అక్క‌డి మద్యం డిపోలు కంటైన్మెంట్ జోన్​లో ఉండటంతో మద్యం సరఫరాను అధికారులు నిలిపివేశారు. మందుబాబులు పోటెత్తడంతో తొలిరోజు 40 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మ‌కాలు జరిగినట్లు తెలుస్తోంది.