టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలుగు వ్యక్తులు మృతి

టెక్సాస్ రోడ్డు ప్రమాదంతో మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దచింతకుంటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కూతురు మౌనికకు పెళ్లి సంబంధం చూసేందుకు నరసింహ రెడ్డి దంపతులు అమెరికా వెళ్లారు.

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలుగు వ్యక్తులు మృతి

Updated on: Nov 29, 2020 | 1:43 PM

టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంతో మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దచింతకుంటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కూతురు మౌనికకు పెళ్లి సంబంధం చూసేందుకు నరసింహ రెడ్డి దంపతులు అమెరికా వెళ్లారు. గత ఆరు నెలలుగా వారు టెక్సాస్‌లోనే ఉంటున్నారు. కుమారుడు భరత్, కూతురు మౌనిక అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో నరసింహారెడ్డి, ఆయన భార్య లక్ష్మి, కుమారుడు భరత్‌ చనిపోయారు. గాయపడ్డ కూతురు మౌనిక పరిస్థితి విషమంగా ఉంది.

కొవిడ్ కారణంగా వీసా జారీలో జాప్యం కావడంతో నరసింహరెడ్డి దంపతులు టెక్సాస్‌లోనే ఉండిపోయారు. నరసింహారెడ్డి హైదరాబాద్‌ వన్‌ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. మరో ఆర్నెళ్లలో ఆయన రిటైర్‌ కానున్నారు. ఈ లోపే ఈ విషాదం చోటుచేసుకుంది. మృతదేహాలు త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం సహకరించాలని బంధువులు కోరుతున్నారు.

అమిత్ షా హైదరాబాద్ పర్యటన లైవ్ అప్‌డేట్స్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :

Loading...
Unable to load recommendations.
Follow Us