అప్పన్న బంగారం కేసులో ముగ్గురు అరెస్ట్

సింహాచలం అప్పన్న బంగారం అమ్మకం కేసులో నిందితులు హైమావతి, వాసు, నాగేంద్రను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేశ్ బాబు వెల్లడించారు.

అప్పన్న బంగారం కేసులో ముగ్గురు అరెస్ట్

Updated on: Sep 09, 2020 | 7:15 PM

సింహాచలం అప్పన్న బంగారం అమ్మకం కేసులో నిందితులు హైమావతి, వాసు, నాగేంద్రను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేశ్ బాబు వెల్లడించారు. ఇద్దరు దేవస్థాన సిబ్బంది పాత్ర ఉన్నట్టు ఐడెంటిఫై చేసినట్ల తెలిపారు. శ్రావణి అనే బాధిత మహిళ ఫిర్యాదుతో విచారణ చేశామని.. మోసం చేయడానికి గోపాలపట్నంలో ఒక రసీదును డిజైన్ చేశారని డీసీపీ వివరించారు. స్టాంపును ద్వారకానగర్‌లో తయారు చేయించారని తెలిపారు. నిందితుల నుంచి రూ.2 లక్షలు రికవరీ చేశామన్న డీసీపీ.. సూళ్లూరుపేటలోనూ ఒక కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.