ఆగ్రాలో కొత్తగా 25 కరోనా కేసులు..

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. భారత్‌లో ఇప్పటికే 2,600 మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా చారిత్రక నగరం ఆగ్రాలో కొత్తగా

ఆగ్రాలో కొత్తగా 25 కరోనా కేసులు..

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. భారత్‌లో ఇప్పటికే 2,600 మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా చారిత్రక నగరం ఆగ్రాలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ వెల్లడించారు. కొత్తగా నమోదైన కరోనా కేసులన్నీ నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారివేనని తెలుస్తోంది. ఈ 25 కేసులతో ఆగ్రాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 45కి చేరింది. మొత్తంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 175 కరోనా పాజిటివ్ కేసులున్నాయి.