2021 Maruti Celerio Launched: మారుతీ సుజుకీ తన తక్కువ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ సెలెరియోలో కొత్త మోడల్‌ను బుధవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షలుగా పేర్కొంది. కొత్త మోడల్‌లో కంపెనీ కొన్ని మార్పులు చేసింది. అలాగే, స్పోర్టీ లుక్‌ని ఇవ్వడానికి ప్రయత్నించారు. పెట్రోల్ వేరియంట్‌లో విడుదలైన కారు 26.68 kmpl మైలేజీని ఇస్తుంది. దీంతె ప్రస్తుతం దేశంలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే పెట్రోల్ కారుగా రికార్డు నెలకొల్పనుంది. సెలెరియో 2014లో ప్రారంభించారు. గత 7 ఏళ్లలో కంపెనీ మొత్తం 5.9 లక్షల యూనిట్లను విక్రయించింది.
కొత్త సెలెరియో K10C DualJet 1.0-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో అందించారు. అలాగే స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 66 హెచ్‌పీ పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రస్తుత మోడల్ కంటే 2 హెచ్‌పీ పవర్, 1 ఎన్ఎమ్ టార్క్ తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. దాని LXI వేరియంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉండదు. దాని మైలేజ్ 26.68 kmpl అని కంపెనీ పేర్కొంది. ఇది ప్రస్తుత మోడల్ కంటే 23శాతం ఎక్కువ.
సెలెరియో 2021లో కొత్త రేడియంట్ ఫ్రంట్ గ్రిల్, షార్ప్ హెడ్‌లైట్ యూనిట్, ఫాగ్ లైట్ కేసింగ్‌తో 3D స్కల్ప్టెడ్ ఎక్స్‌టీరియర్ బాడీ ప్రొఫైల్‌ను పొందుతుంది. నలుపు రంగులతో కూడిన ఫ్రంట్ బంపర్ కూడా కొత్తదే. ఇందులోని కొన్ని అంశాలు ఎస్-ప్రెస్సో నుంచి కూడా తీసుకున్నారు. ఔట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే కారు సైడ్ ప్రొఫైల్ కూడా పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఇది కొత్త డిజైన్‌తో 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో, మీరు బాడీ-కలర్ రియర్ బంపర్‌లు, ఫ్లూయిడ్ లుకింగ్ టెయిల్‌లైట్‌లు, కర్వీ టెయిల్‌గేట్‌ను పొందుతారు.
సెలెరియో 2021 ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇందులో ప్రయాణికులకు మరింత స్థలం లభించనుంది. కారు లోపల, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ హిల్ హోల్డ్ అసిస్ట్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ కారు షార్ప్ డ్యాష్ లైన్‌లు, క్రోమ్ యాక్సెంట్‌లతో కూడిన ట్విన్-స్లాట్ ఏసీ వెంట్‌లు, కొత్త గేర్ షిఫ్ట్ డిజైన్, అప్హోల్స్టరీ కోసం కొత్త డిజైన్‌తో సెంటర్-ఫోకస్డ్ విజువల్ అప్పీల్‌ను పొందుతుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు మద్దతుతో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో డిస్‌ప్లేను కలిగి ఉంది.
సెలెరియో 2021 వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు
వేరియంట్ | మాన్యువల్ ధర | AMT ధర |
LXi | రూ. 4.99 లక్షలు | |
VXi | రూ. 5.63 లక్షలు | రూ. 6.13 లక్షలు |
ZXi | రూ. 5.94 లక్షలు | రూ. 6.44 లక్షలు |
ZXi+ | రూ. 6.44 లక్షలు | రూ. 6.94 లక్షలు |
సెలెరియో 2021 భద్రతా ఫీచర్లు..
ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్ హోల్డ్ అసిస్ట్ (మొదటి సెగ్మెంట్)తో మొత్తం 12 భద్రతా ఫీచర్లు అందించారు. కొత్త సెలెరియో ఫ్రంటల్-ఆఫ్‌సెట్, సైడ్ క్రాష్, పాదచారుల భద్రత వంటి అన్ని భారతదేశ భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉందని కంపెనీ పేర్కొంది. ఇది సాలిడ్ ఫైర్ రెడ్, స్పీడీ బ్లూతో పాటు ఆర్కిటిక్ వైట్, సిల్కీ సిల్వర్, గ్లిస్టెనింగ్ గ్రే, కెఫిన్ బ్రౌన్, రెడ్, బ్లూతో సహా 6 రంగులలో అందుబాటులో ఉంటుంది.
Also Read: Hiking prices: పెరుగుతున్న ధరలతో పండగ ‘కళ’ తప్పింది..
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఎంపీ-లాడ్స్ నిధుల పునరుద్ధరణకు ఆమోదం