2020 రౌండప్: క్రికెట్‌కు అచ్చిరాని సంవత్సరం.. కానీ పలు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.. అవేంటంటే..!

2020 Round Up:  2020లో క్రికెట్, స్పోర్ట్స్ ఈవెంట్స్ చాలా తక్కువగా జరిగాయి. మొత్తం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి భయభ్రాంతులకు గురి చేయడంతో...

2020 రౌండప్: క్రికెట్‌కు అచ్చిరాని సంవత్సరం.. కానీ పలు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.. అవేంటంటే..!
Follow us

|

Updated on: Dec 28, 2020 | 4:26 PM

2020 Round Up:  2020లో క్రికెట్, స్పోర్ట్స్ ఈవెంట్స్ చాలా తక్కువగా జరిగాయి. మొత్తం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి భయభ్రాంతులకు గురి చేయడంతో చిన్నా, పెద్దా టోర్నీలు అన్నీ కూడా వాయిదా పడ్డాయి. ఆ తర్వాత ఐపీఎల్ బయోబబుల్ వాతావరణంలో జరగడం.. అలాగే పలువురికి కరోనా రావడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అలాగే పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • గ‌వాస్క‌ర్ వర్సెస్ కోహ్లీ…

భారత్ క్రికెట్‌లో అతి పెద్ద వివాదానికి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెరలేపాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మపై అతడు చేసిన సంచలన కామెంట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ విషయంపై గవాస్కర్-అనుష్క మధ్య ట్వీట్ వార్ కూడా జరిగింది. అసలు విషయమేంటంటే..

ఐపీఎల్‌లో వరుస మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ విఫలం కావడంతో గవాస్కర్ పలు విమర్శలు గుప్పించాడు. లాక్ డౌన్ సమయంలో భార్య అనుష్క వేసిన బంతులనే ప్రాక్టీస్ చేసి ఉంటాదంటూ సంచలన కామెంట్స్ చేశాడు. దీనికి అనుష్క కూడా గట్టి రిప్లై ఇచ్చింది. అంతటితో గవాస్కర్ సైలెంట్ కాలేదు.

తాజాగా జరుగుతున్న ఆస్ట్రేలియా టూర్‌లో కోహ్లీకి పితృత్వ సెలవులను బీసీసీఐ గ్రాంట్ చేయడంపై కూడా గవాస్కర్ స్పందించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఒక రూల్.. అశ్విన్, నటరాజన్ వంటి ప్లేయర్స్‌కు మరో రూలా అంటూ సూటిగా బీసీసీఐను ప్రశ్నించాడు. ఈ అంశంపై పలువురు గవాస్కర్‌కు మద్దతు తెలపగా.. మరికొందరు చురకలు అంటించారు.

  •  ఐపీఎల్ నుంచి రైనా ఔట్…

యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 2020 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా అర్ధాంతరంగా తప్పుకోవడం పెద్ద సంచలనమైంది. బయోబబుల్ వాతావరణంలో టోర్నీ కోసం ప్రాక్టీస్ షురూ చేసిన రైనా.. అర్ధాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల రైనా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడని వార్తలు రాగా.. కెప్టెన్ ధోని, సీఎస్కే మధ్య విభేదాల కారణంగానే రైనా తప్పుకున్నాడని సోషల్ మీడియాలో పుకార్లు హల్‌చల్ చేశాయి. ఏది ఏమైనా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రైనా.. ఈ ఏడాది టోర్నీ తప్పుకోవడంతో చెన్నై మొదటిసారి ప్లేఆఫ్స్‌కు వెళ్ల‌కుండానే ఇంటిదారి పట్టింది.

  • కాంక‌ష‌న్ వివాదం…

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా తీసుకున్న ఓ నిర్ణయం పెద్ద వివాదానికి దారి తీసింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజాకు గాయం కావడంతో అతడి స్థానంలో కాంకషన్‌ స‌బ్‌స్టిట్యూట్‌గా స్పిన్నర్ చాహల్‌ను తీసుకున్నారు. దీనికి ఆస్ట్రేలియా కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్ అభ్యంత‌రం వ్యక్తం చేశాడు.

నిబంధ‌న‌ల ప్ర‌కారమే కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌ను తీసుకున్నామని టీమిండియా వాదించింది. బ్యాట్స్‌మన్ గాయమైతే బ్యాట్స్‌మ‌న్‌ను, ఆల్‌రౌండ‌ర్ అయితే ఆల్‌రౌండ‌ర్‌ను.. బౌల‌ర్ అయితే బౌల‌ర్‌ను తీసుకోవాలంటూ ఆసీస్ కోచ్ పెద్ద రచ్చకు దిగాడు. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది అనుకోండి. ఏది ఏమైనా ఆల్‌రౌండ‌ర్ జ‌డేజా స్థానంలో స్పిన్న‌ర్ చాహ‌ల్‌ను ఇండియా కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌గా తీసుకోవడంతోనే అసలు రగడ మొదలైంది. చాహల్ మాత్రం మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు.

  • రోహిత్ గాయంపై రగడ…

కరోనా వైరస్ తర్వాత టీమిండియాకు ఆస్ట్రేలియా పర్యటనలో  మొదటి అంతర్జాతీయ సిరీస్. దీనికి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఐపీఎల్‌లో అతడికి గాయం అయిందని.. ఫిట్‌గా లేదంటూ జవాబిచ్చారు. అయితే అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తూ రోహిత్ ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడాడు.

దీనితో పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. అటు కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రోహిత్ గాయంపై భిన్నంగా స్పందించడంతో.. హిట్‌మ్యాన్ గాయాన్ని హ్యాండిల్ చేసే విష‌యంలో బీసీసీఐ పూర్తిగా విఫ‌ల‌మైందంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇక తాజాగా మూడో టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

  • పాక్ బౌలర్ మ‌హ్మ‌ద్ ఆమిర్ గుడ్‌బై…

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ బౌలర్ మహమ్మద్ ఆమిర్.. పీసీబీపై చేసిన విమర్శలు సంచలనం రేపాయి. పాక్ క్రికెట్ బోర్డు త‌న‌ను చాలా వేధిస్తోందని.. ఇక క్రికెట్ ఆడ‌టం త‌న వ‌ల్ల కాదంటూ ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే న్యూజిలాండ్ టూర్‌కు త‌న‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డం వల్ల మ‌న‌స్థాపం చెంది ఈ కామెంట్స్ చేస్తున్నాడంటూ కొందరు వాదించారు.

Latest Articles
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..
వేములవాడకు నరేంద్ర మోదీ.. తొలి ప్రధానిగా రికార్డు!
వేములవాడకు నరేంద్ర మోదీ.. తొలి ప్రధానిగా రికార్డు!
కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..
కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
ఛీ.. ఛీ.. అమ్మాయే అబ్బాయికి ముద్దు పెట్టింది.. చర్యలు తీసుకోండి..
ఛీ.. ఛీ.. అమ్మాయే అబ్బాయికి ముద్దు పెట్టింది.. చర్యలు తీసుకోండి..