శ్రీలంకలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో కర్ణాటక జేడీఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. కంచనహళ్లి లక్ష్మీనారాయణ, గోవెనహళ్లి శివన్న, అడకిమరనహళ్లి మారెగౌడ, హనుమంతరాయప్ప, హెచ్.పుట్టరాజు సహా మరొక నేత ఈ నెల 20న శ్రీలంకకు వెళ్లగా.. పేలుళ్ల ఘటన తర్వాత కుటుంబసభ్యులకు వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. వారిలో ఇద్దరు మరణించినట్లు భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.
మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు. ‘‘శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో జేడీఎస్‌కు చెందిన ఇద్దరు నేతలు మృతిచెందారని విని షాక్‌కు గురయ్యా. గల్లంతైన ఐదుగురి కోసం ఇండియన్ హై కమిషన్‌తో మాట్లాడుతున్నాం’’ అని అన్నారు.