
హిమాచల్ ప్రదేశ్ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. దేశ రాజధాని తరహాలో సీన్ రిపీట్ అయ్యింది. అయితే ఇక్కడ బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. పర్యాటక ప్రాంతమైన సిమ్లా నగరంలో 19ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా బాధితురాలు సోమవారం హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సిమ్లాలోని మాల్‌రోడ్డులో నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో కొందరు వచ్చి.. తనను బలవంతంగా అందులోకి ఎక్కించుకుని తీసుకెళ్ళారని.. అందులో ఉన్న ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.