బ్రేకింగ్ : పొలంలో ‘పండిన’ 17 పంచలోహ విగ్రహాలు..!

తమిళనాడులో భారీగా పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఓ రైతు పొలం చదును చేస్తుండగా ఇవి బయటపడ్డాయి. ఈ ఘటన పుదుక్కోటై జిల్లా తిరుమయ్యం గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో వెంటనే రైతు అధికారులకు సమాచారం ఇచ్చాడు. పొలంలోని భారీ వృక్షాన్ని తొలగించి తవ్వకాలు జరుపగా 17 విగ్రహాలు, ఓ పీఠం వెలికి తీశారు అధికారులు. విగ్రహాల విలువ వందల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి వందేళ్లకు పైబడిన విగ్రహాలుగా అధికారులు గుర్తించారు. మరిన్ని విగ్రహాలు ఉండవచ్చన్న […]

బ్రేకింగ్ : పొలంలో పండిన 17 పంచలోహ విగ్రహాలు..!

Edited By:

Updated on: Jun 19, 2019 | 12:15 PM

తమిళనాడులో భారీగా పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఓ రైతు పొలం చదును చేస్తుండగా ఇవి బయటపడ్డాయి. ఈ ఘటన పుదుక్కోటై జిల్లా తిరుమయ్యం గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో వెంటనే రైతు అధికారులకు సమాచారం ఇచ్చాడు. పొలంలోని భారీ వృక్షాన్ని తొలగించి తవ్వకాలు జరుపగా 17 విగ్రహాలు, ఓ పీఠం వెలికి తీశారు అధికారులు. విగ్రహాల విలువ వందల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి వందేళ్లకు పైబడిన విగ్రహాలుగా అధికారులు గుర్తించారు. మరిన్ని విగ్రహాలు ఉండవచ్చన్న ఉద్ధేశంతో ఇంకా పొలంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి.