ఏపీ పోలీస్ శాఖలో 13 వేల ఉద్యోగాలు..!

| Edited By:

Jul 03, 2019 | 11:08 AM

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ శాఖలో ప్రస్తుతం 12,198 ఖాళీలున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. వారాంతపు సెలవుల విధానం అమలు చేస్తున్నందున భవిష్యత్తు దృష్ట్యా 30 శాతం సిబ్బందిని అదనంగా నియమించాలని పోలీస్ శాఖ అంచనా వేస్తోందట. దీనిపై ప్రభుత్వంతో కూడా చర్చలు జరపాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు దశలవారీగా పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతోంది. ఒకవేశ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పోలీస్ ఉద్యోగం కోసం వేచిచూస్తున్న నిరుద్యోగుల కల […]

ఏపీ పోలీస్ శాఖలో 13 వేల ఉద్యోగాలు..!
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ శాఖలో ప్రస్తుతం 12,198 ఖాళీలున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. వారాంతపు సెలవుల విధానం అమలు చేస్తున్నందున భవిష్యత్తు దృష్ట్యా 30 శాతం సిబ్బందిని అదనంగా నియమించాలని పోలీస్ శాఖ అంచనా వేస్తోందట. దీనిపై ప్రభుత్వంతో కూడా చర్చలు జరపాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు దశలవారీగా పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతోంది. ఒకవేశ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పోలీస్ ఉద్యోగం కోసం వేచిచూస్తున్న నిరుద్యోగుల కల నిజమవుతుంది. కాగా.. జూన్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లోని పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవులు అమలవుతున్నాయి. ఈ వీక్లీఆఫ్‌తో అటు పోలీసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.