Breaking News
  • రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. గడచిన 24 గంటల్లోనే 438 మంది వైరస్‌ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులకు పది ప్రాంతాలు డేంజర్‌ స్పాట్స్‌గా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.
  • అసలే జనం భయంతో బతికేస్తున్నారు. ఈ టైమ్‌లో కరోనాపై అవాకులు చవాకులు పేల్చేవాళ్లు ఎక్కువయ్యారు. కొందరు ఫేక్‌ న్యూస్‌ పోస్టు చేస్తుంటే కొందరు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై, వైద్యులపై ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొత్తం రాష్ట్ర పరిస్థితిని ఆరా తీస్తున్నారు.
  • ఏలూరులో ఒక్కసారిగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు తెరమీదకు వచ్చాయి. ఇంకెన్ని ఉంటాయోనని ప్రజలు భయపడుతుంటే అలాంటి హై రిస్క్‌ జోన్‌లో నిరంతరం పని చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సిటీలో 144 సెక్షన్‌ అమలవుతోంది. కుటుంబాలకు దూరంగా రెడ్‌జోన్‌లో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.
  • ప్రతీది కరోనా కాదు.. పొడిదగ్గు తుమ్ములు ఉంటే వాయుకాలుష్యం. దగ్గు, తెమడ, ముక్కు కారడం, తుమ్ములు వస్తే జలుబు. దగ్గు, తెమడ, తుమ్ములు, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, బలహీనత, తేలికపాటి జ్వరం ఫ్లూ లక్షణాలు. పొడిదగ్గు, తుమ్ములు, ఒంటి నొప్పులు, అధిక జ్వరం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ కొవిడ్‌-19 లక్షణాలు. ప్రతీది కరోనా కాదు.. కంగారు పడొద్దు..
  • నిజాముద్దీన్ మర్కజ్ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ నోటీసులు. తబ్లీఘీ-జమాత్ చీఫ్ మౌలానా సాద్ సహా 7గురు నిందితులకు నోటీసులు. నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం. నిందితుల ఇళ్లకు నోటీసులు పంపించిన క్రైం బ్రాంచ్.

రేవంత్ రెడ్డి బ్రదర్స్ కబ్జా బాగోతం..!

గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ గోపనపల్లిలోని విలువైన భూముల్లో అక్రమ లావాదేవీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. గోపనపల్లి భూ అవకతవకలపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూ లావాదేవీల్లో అక్రమాలకు సహకరించారనే ఆరోపణలతో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ గా పని చేసిన శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేసింది.
Congress leader Revanth Reddy land at Gopanpally is illegal, రేవంత్ రెడ్డి బ్రదర్స్ కబ్జా బాగోతం..!

గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ గోపనపల్లిలోని విలువైన భూముల్లో అక్రమ లావాదేవీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. గోపనపల్లి భూ అవకతవకలపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూ లావాదేవీల్లో అక్రమాలకు సహకరించారనే ఆరోపణలతో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ గా పని చేసిన శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుంది. ఈ ఆదేశాలు అమల్లో ఉన్నంత వరకూ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లొద్దని శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండల్‌ రెడ్డి ఈ భూముల్లో ఆరు ఎకరాలకు పైగా కొనుగోలు చేశారనే అరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో పేర్లను ఇష్టానుసారంగా మార్చి కేవలం మ్యుటేషన్ ఆధారంగానే భూముల లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. భూముల మ్యుటేషన్‌పై సమగ్ర విచారణ జరపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయ్‌ కుమార్‌ ఆదేశించారు. గతంలోనే రేవంత్ రెడ్డి బ్రదర్స్‌పై భూ కజ్జాకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో మొత్తం 16 మంది సాక్షులను విచారించారు. విచారణలో భాగంగా గోపనపల్లి భూముల లావాదేవీలపై రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, లక్ష్మయ్యలపై సెక్షన్ 447, 427, 506 లతో పాటు రెడ్‌విత్ 34, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టులో 28 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేశారు పోలీసులు.

Related Tags