తమిళనాడులో దారుణం.. జర్నలిస్టును నరికి చంపిన దుండగులు.. రియల్ ఏస్టేట్ వ్యవహారమే కారణమా..?

తమిళనాడులో దారుణం జరగింది. కృష్ణగిరి జిల్లా హోసూరులో నాగరాజు (52) అనే జర్నలిస్టు ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. సమత్వపురం హనుమంతనగర్‌కు చెందిన నాగరాజు..

  • Balaraju Goud
  • Publish Date - 7:42 pm, Mon, 23 November 20
తమిళనాడులో దారుణం.. జర్నలిస్టును నరికి చంపిన దుండగులు.. రియల్ ఏస్టేట్ వ్యవహారమే కారణమా..?

తమిళనాడులో దారుణం జరగింది. కృష్ణగిరి జిల్లా హోసూరులో నాగరాజు (52) అనే జర్నలిస్టు ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. సమత్వపురం హనుమంతనగర్‌కు చెందిన నాగరాజు ఓ తమిళ దినపత్రిక విలేకరిగా పని చేస్తున్నారు. ఉదయం 6.30 గంటల సమయంలో తన ఇంటి వద్ద ఉండగా గుర్తు తెలియని నలుగురు వచ్చి వేట కొడవళ్లతో దాడి చేశారు. తప్పించుకునేందుకు పారిపోతుండగా, వెంబడించిన దుండగులు హతమార్చారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన నాగరాజు పదిహేనేళ్ల క్రితం హోసూరు వచ్చి స్థిరపడ్డారు. స్థిరాస్తి వ్యాపారం కూడా చేస్తూ జర్నలిస్ట్ వృత్తిని కొనసాగిస్తున్నాడు. అటు, హిందూ మహాసభ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగానూ ఉన్నారు. కుటుంబసభ్యుల సమాచారం ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యప్తు చేపట్టారు. హడ్కో పోలీసులు నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించినట్లు డీవైఎస్పీ తెలిపారు. రియల్ ఏస్టేట్ వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడిన విభేదాల కారణంగా హత్య కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.