Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు

, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. సన్నాహక సభలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూసుకెళ్తున్నారు. గులాబీ కేడర్‌కు దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, వరంగల్లో కేటీఆర్ సభలు నిర్వహించారు. నేడు మెదక్, మల్కాజ్ గిరి పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నిర్వహించే టీఆర్ఎస్ సన్నాహక సభల్లో కేటీఆర్ పాల్గొననున్నారు.

మెదక్ జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ గ్రౌండ్ వేదికగా సన్నాహక సభకు గులాబీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ సభకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుచి 25 వేల మంది ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డితో పాటు ఇతర నేతలు సభా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

16 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మెదక్‌కు తొలిసారి రానుండడంతో టీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు చిన్న శంకరం పేట అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్ నివాళులర్పించున్నారు. అనంతరం బైక్ ర్యాలీగా మెదక్ చేరకోనున్నారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీపులో మెదక్ ప్రధాన రహదారి నుంచి మున్సిపల్ కార్యాలయం, రాందాస్ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా సభాస్థలికి చేరుకుంటారు. మెదక్ సభ పూర్తి కాగానే మల్కాజ్ గిరిలో జరిగే సన్నహాక సభకు కేటీఆర్ బయలుదేరుతారు.

, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు