ముగిసిన కోడెల అంత్యక్రియలు

Kodela Siva Prasada Rao Last Rites, ముగిసిన కోడెల అంత్యక్రియలు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు ముగిశాయి.  అశ్రు నయనాలతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు.  గుంటూరు జిల్లా నరసరావుపేటలోని స్వర్గధామంలో ఆయన కుమారుడు కోడెల శివరామ్‌ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంతకుముందు.. కడసారి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. ఉదయం నుంచి కోడెల నివాసంవద్ద ఆయన పార్ధివదేహానికి నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున క్యూలో బారులు తీరారు. కోడెల ఇంటికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు, దారిమళ్లింపు చర్యలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ… కోడెల నివాసానికి చేరుకున్న తర్వాత ఊరేగింపుగా అంతిమయాత్ర చేపట్టారు. నరసరావుపేటలోని కోడెల నివాసం నుంచి సత్తెనపల్లి రోడ్డు వినాయక ఆలయం మీదుగా బరంపేట నుంచి పెద్ద చెరువు, ఇందిరాగాంధీ బొమ్మ, మల్లం సెంటర్, కోట సెంటర్ ఆయాల బజార్ మీదుగా గుంటూరు రోడ్డులోని స్వర్గపురికి తీసుకువచ్చారు.

అంత్యక్రియలకు  చంద్రబాబుతో పాటు నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాసరావు, కరణం బలరాం తదితరులు హాజరయ్యారు… కోడెల అంతిమయాత్ర సందర్భంగా పోలీసులు పలు చోట్ల ఆంక్షలు, దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. పలు చోట్ల పోలీసులకి, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *