Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

మాజీ డిప్యూటీ సీఎం ఇళ్లపై ఐటీ రైడ్స్.. ఆస్తుల విలువ తెలిస్తే షాక్ తినాల్సిందే..!

Karnataka Ex Deputy CM Hold Rs.5000 Cr Assets - It Found inputs, మాజీ డిప్యూటీ సీఎం ఇళ్లపై ఐటీ రైడ్స్.. ఆస్తుల విలువ తెలిస్తే షాక్ తినాల్సిందే..!

కర్ణాటకలో ఐటీశాఖ ఆకస్మిక దాడులు చేపట్టింది. ఈ తనిఖీల్లో దాదాపు రూ.5.00 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జీ.ప‌ర‌మేశ్వ‌ర‌ ఇంటితో పాటు ఆయన ఇత‌ర నివాసాల్లో గురువారం ఐటీ దాడులు చేసిన విష‌యం తెలిసిందే. అయితే వివిధ ప్రాంతాల్లో జ‌రిపిన సోదాల్లో సుమారు రూ. 5 కోట్ల న‌గ‌దు దొరికిన‌ట్లు ఇవాళ ఐటీ అధికారులు చెప్పారు. శుక్రవారం కూడా మ‌రో 25 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గురువారం బెంగుళూరుతో పాటు తుమ‌కూరులోని ప‌లు ప్రాంతాల్లో సోదాలు చేశారు.

జీ. పరమేశ్వర ఇళ్లలోనే కాకుండా.. మాజీ ఎంపీ ఆర్‌ఎల్‌ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇండ్లపై కూడా ఐటీ శాఖ గురువారం దాడులు జరిపింది. పరమేశ్వర కుటుంబం సిద్ధార్థ గ్రూప్‌ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నది. ఈ సంస్థలను పరమేశ్వర తండ్రి హెచ్‌ఎం గంగాధరయ్య యాభై ఎనిమిది ఏళ్ల కిందట స్థాపించారు. పరమేశ్వర ఇంటితోపాటు ఆయన విద్యా సంస్థల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పరమేశ్వర సోదరుడు శివప్రసాద్‌, వ్యక్తిగత సహాయకుడు రమేశ్‌ ఇండ్లపై కూడా దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. కోలార్‌ జిల్లా దొడ్డబల్లపురలో ఉన్న ఆర్‌ఎల్‌ జాలప్ప ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని రాజేంద్ర నిర్వహిస్తున్నారు. నీట్‌ పరీక్ష విషయంలో కోట్లాది రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 300 మంది ఐటీ సిబ్బంది ఇద్దరు నేతలకు సంబంధించిన 30 ప్రాంతాలలో దాడులు చేసినట్టు అధికారులు చెప్పారు.

కర్ణాటకలోనే కాదు.. అటు రాజస్థాన్‌లోని వారి కార్యాలయాలపై కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. తుమకూరు నగరంలో శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని రెండు మెడికల్‌ కళాశాలల్లో జరిగిన నీట్ పరీక్షల్లో.. అనేక అవకతవకలు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరీక్షల్లో నీట్ అభ్యర్థులకు బదులుగా వేరొకరితో పరీక్షలు రాయించినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు గాను.. లక్షల రూపాయలు చేతులు మారాయని.. పుకార్లు వచ్చాయి. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తున్నది. కాగా, దాడులపై తనకు సమాచారం లేదని.. దాడులు ఎందుకు జరుపుతున్నారో కూడా తెలియదని పరమేశ్వర తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేస్తూ.. కావాలనే ఐటీ దాడులు కేంద్ర చేయిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా, మరోవైపు ఈ ఐటీ దాడుల్లో మాజీ డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర ఆస్తులు రూ.5,000 కోట్లకు పైగా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు అనధికార సమాచారం అందుతోంది.