Breaking News
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
  • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

చంద్రబాబుకు పవన్ ఫోన్..ఏం మాట్లాడారు..?

Pawan Kalyan Phone Call to Ex CM Chandrababu Naidu, చంద్రబాబుకు పవన్ ఫోన్..ఏం మాట్లాడారు..?

ఏపీలో ఇసుక కొరతపై జనసేన ఆందోళనలకు సిద్దమైంది. ఈ విషయంలో పలు పక్షాలను కలుపుకుపోయేందుకు మార్గాలను అన్వేశిస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో బేషజాలు చూపనని గతంలోనే ప్రకటించిన పవన్ కళ్యాణ్..ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి జనసేనాని పలు పార్టీల నాయకులతో ఫోన్ సంభాషణలు జరిపారు. ఎటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలమని అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు పవన్ ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కోసం అక్కడి రాజకీయపక్షాలు ఎలా ఉమ్మడి స్ఫూర్తి చూపుతున్నాయో..ఏపీలో ఇసుక సమస్య పరిష్కారానికి, లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు మళ్ళీ ఉపాధి లభించేలా సమైక్యంగా పోరాడాలని పవన్ అన్నారు. పవన్  విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పవన్ చేసిన రిక్వెస్టుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. నవంబర్ 3న విశాఖలో జనసేన ఇసుక కొరత, భవనిర్మాణ కార్మికుల కష్టాలపై ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.   సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, లోక్ సత్తా అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ, బీఎస్పీ అధ్యక్షుడు సంపత్‌రావుతో పవన్ మాట్లాడారు. ఇక ఎప్పట్నుంచో పవన్‌కు.. కమ్యునిష్టు పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ కార్యకర్తలు మినహా ఏపీలోని అన్ని విపక్ష పార్టీలు జనసేన పిలుపుతో కలిసివచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక అన్ని వర్గాలు సపోర్ట్ లభిస్తే  జనసేన చేపట్టిన లాంగ్ మార్చ్​ హ్యూజ్ సక్సెస్ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది.

Related Tags