చంద్రయాన్‌-2: చంద్రుని అవతలివైపు ఫోటోలు తీసిన ఆర్బిటర్!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్‌ విఫలమైనప్పటికీ.. ఆర్బిటార్‌ మాత్రం సమర్థవంతంగా పనిచేస్తోంది. తాజాగా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ప్రకాశవంతమైన ఫొటోలను ఆర్బిటార్‌ తీసింది. స్పెక్ట్రోమీటర్‌ను ఉపయోగించి చంద్రుడి ఉపరితలం మీద పడుతున్న సూర్యకాంతిలోని తారతమ్యాలను విశ్లేషించింది. తద్వారా చంద్రుడి ఉపరితలంపై నిక్షిప్తమైన మూలకాల స్థాయిని.. అదే విధంగా చంద్రుడి మూల స్థానం, పరిభ్రమానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే వీలు కల్పించింది. ఈ క్రమంలో ఆర్బిటార్ తీసిన ఫొటోలను […]

చంద్రయాన్‌-2: చంద్రుని అవతలివైపు ఫోటోలు తీసిన ఆర్బిటర్!
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 4:49 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్‌ విఫలమైనప్పటికీ.. ఆర్బిటార్‌ మాత్రం సమర్థవంతంగా పనిచేస్తోంది. తాజాగా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ప్రకాశవంతమైన ఫొటోలను ఆర్బిటార్‌ తీసింది. స్పెక్ట్రోమీటర్‌ను ఉపయోగించి చంద్రుడి ఉపరితలం మీద పడుతున్న సూర్యకాంతిలోని తారతమ్యాలను విశ్లేషించింది. తద్వారా చంద్రుడి ఉపరితలంపై నిక్షిప్తమైన మూలకాల స్థాయిని.. అదే విధంగా చంద్రుడి మూల స్థానం, పరిభ్రమానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే వీలు కల్పించింది. ఈ క్రమంలో ఆర్బిటార్ తీసిన ఫొటోలను ఇస్రో తన ట్విటర్‌లో అకౌంట్‌లో షేర్‌ చేసింది. కాగా చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదన్న సంగతి తెలిసిందే. సూర్యకాంతి అద్దం మీద పడి ప్రతిబింబించినట్లుగా.. చంద్రుడి ఉపరితలంపై కాంతి పడి పరావర్తనం చెందడం ద్వారా చంద్రుడు మెరుస్తున్నట్లుగా కనిపిస్తాడు. అయితే చంద్రుడి ఉపరితలం అంతటా ఈ కాంతి ఒకేవిధంగా పరావర్తనం చెందదు. చంద్రుడికి సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలను కనుగొనేందుకు ఇస్రో పంపిన ఆర్బిటర్‌ ఉపయోగపడనుంది.

మనం చూడలేం కదా. కానీ చంద్రయాన్-2 ఆర్బిటర్… చూడగలిగింది. చందమామకు అవతలివైపు… ఉత్తర భాగంలో ఉన్న ఉపరితలాన్ని ఫొటోతీసింది. ఆ ఫొటో అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తోంది. దాన్ని ఇస్రో తన ట్విట్టర్‌ అకౌంట్‌లో రిలీజ్ చేసింది. చంద్రయాన్-2కి ఉన్న IIRS పేలోడ్ ద్వారా ఈ ఫొటో లభించింది. చందమామ ఉపరితలంపై ఎంత వరకూ సూర్యుడి ఎండ పడుతుందో లెక్కించడానికి తయారుచేసినదే IIRS. రకరకాల స్పెక్ట్రల్ ఛానెల్స్ ద్వారా ఈ ఫొటోని రూపొందించినట్లు ఇస్రో తెలిపింది. IIRS అనేది… చందమామ పై భాగాన్ని (ఉపరితలాన్ని) రకరకాలుగా ఫొటోలు తీస్తుంది. తద్వారా దానిపై ఉన్న ఖనిజాలేంటి? అది ఎలా తయారైంది? అసలు చందమామ ఎలా పుట్టింది అనే అంశాలు తెలుసుకునే ఛాన్స్ ఉందని ఇస్రో చెప్పింది.