కరోనాపై పోరులో చేతులు కలిపిన ఇజ్రాయెల్, భారత్

కరోనా వైరస్ పై పోరులో ఇజ్రాయెల్, భారత్ చేతులు కలిపాయి. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ఢిల్లీలోని ఎయిమ్స్ కి అత్యాధునిక వైద్య సాధనాలను అందజేసింది. ఇండియాలో రాయబారి..

కరోనాపై పోరులో చేతులు కలిపిన ఇజ్రాయెల్, భారత్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 12, 2020 | 4:43 PM

కరోనా వైరస్ పై పోరులో ఇజ్రాయెల్, భారత్ చేతులు కలిపాయి. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ఢిల్లీలోని ఎయిమ్స్ కి అత్యాధునిక వైద్య సాధనాలను అందజేసింది. ఇండియాలో రాయబారి డాక్టర్ రాన్ మాల్కా నుంచి వీటిని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అందుకున్నారు. ఈ సాధనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) అసిస్టెంట్ రోబో, వీడియో ఓరియెంటెడ్ వాయిస్ ఆపరేటర్ తో బాటు ఆసుపత్రి స్టాఫ్ లో ని ఎవరి మొబైల్ ఫోన్ లో నైనా ఏర్పాటు చేసే యాప్ వంటివి ఉన్నాయి. ఈ యాప్ వల్ల సిబ్బంది కరోనా రోగులకు  మరింత త్వరగా సేవలు అందించగలుగుతారు. ఇంకా సీపీడీ పేరిట వ్యవహరించే, 12 గంటలపాటు పని చేసే డిస్ ఇన్ఫెక్షన్ ఉత్పత్తులు కూడా ఉన్నాయి.

కేవలం కరోనా వైరస్ పై గట్టి పోరు జరిపేందుకే  ఈ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్య పరికరాలను ఉత్పత్తి చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది.