గెలిచేది ఎవరో చూద్దాం…

|

Nov 05, 2020 | 6:12 PM

ఐపీఎల్-13 సీజన‌్‌లో ప్లేఆఫ్స్‌ బ్లాక్‌బస్టర్‌కు వేళైంది. లీగ్‌దశ మ్యాచ్‌ల్లో తడిసిముద్దయిన క్రికెట్‌ అభిమానులను ఇక నాకౌట్‌ గేమ్‌లు‌ అలరించనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలిచిన ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి క్వాలిఫయర్‌లో నేడు తాడోపేడో తేల్చుకోనున్నాయి...

గెలిచేది ఎవరో చూద్దాం...
Follow us on

IPL 2020 Qualifier 1st Preview : ఐపీఎల్-13 సీజన‌్‌లో ప్లేఆఫ్స్‌ బ్లాక్‌బస్టర్‌కు వేళైంది. లీగ్‌దశ మ్యాచ్‌ల్లో తడిసిముద్దయిన క్రికెట్‌ అభిమానులను ఇక నాకౌట్‌ గేమ్‌లు‌ అలరించనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలిచిన ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి క్వాలిఫయర్‌లో నేడు తాడోపేడో తేల్చుకోనున్నాయి.

రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్‌ దక్కించుకునేందుకు రోహిత్ సేన పటిష్ట బలగంతో బరిలోకి దిగుతుంటే.. లీగ్‌ దశలో రెండుసార్లు తమను ఓడించిన జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఐపీఎల్‌లో తొలిసారి ఫైనల్‌ చేరాలని ఢిల్లీ కదనోత్సాహంతో రెడీ అవుతోంది.

క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టుకు ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ విజేతతో జరిగే క్వాలిఫయర్‌-2లో గెలిస్తే తుదిపోరుకు చేరవచ్చు.