సూర్యకుమార్ ఇంకా ఏం నిరూపించుకోవాలి.? సెలెక్టర్లపై నెటిజన్లు ఫైర్.!

|

Oct 29, 2020 | 5:11 PM

అటు డొమెస్టిక్.. ఇటు ఐపీఎల్‌ ప్రతీ సీజన్‌లోనూ నిలకడగా రాణిస్తూ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే.. ఇన్నేళ్లుగా అతడు ఎంత మంచి ప్రదర్శనలు

సూర్యకుమార్ ఇంకా ఏం నిరూపించుకోవాలి.? సెలెక్టర్లపై నెటిజన్లు ఫైర్.!
Follow us on

IPL 2020: 2018లో 512 పరుగులు.. 2019లో 424.. 2020లో 362*.. గత మూడు ఐపీఎల్ సీజన్లలో ముంబై బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్ యాదవ్ చేసిన పరుగులివి. ఒక్క ఐపీఎల్‌లో మాత్రమే కాదు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అటు డొమెస్టిక్.. ఇటు ఐపీఎల్‌ ప్రతీ సీజన్‌లోనూ నిలకడగా రాణిస్తూ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే.. ఇన్నేళ్లుగా అతడు ఎంత మంచి ప్రదర్శనలు ఇచ్చినా టీమ్ ఇండియాకు మాత్రం ఎంపిక కాలేకపోతున్నాడు.

తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంతో ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. అయినా కూడా గత రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీని సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టుకు ఎంపిక చేయని సెలెక్టర్లకు ఆర్సీబీపై అర్ధ శతకం బాది సూర్యకుమార్ యాదవ్ సరైన సమాధానం ఇచ్చాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇంతటి నిలకడైన బ్యాట్స్‌మెన్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్ట్ చేయకపోవడంపై విమర్శలు కురిపిస్తున్నారు. మాజీ క్రికెటర్లకు కూడా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఈ నేపధ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ”సూర్యకుమార్ సహనంతో ఎదురు చూడాలని సూచించాడు”. దీనితో ఇప్పుడిదే హాట్ టాపిక్‌ అయింది.

Also Read:

Bigg Boss 4: ఈ సీజన్‌ టాప్ 5‌లో నిలిచేది వీళ్లే..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రీఫండ్ సమయం పెంపు.!

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..