టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

|

Oct 18, 2020 | 3:20 PM

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు అబుదాబీ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలబడబోతున్నాయి. SRH ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడగా..

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్
Follow us on

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు అబుదాబీ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలబడబోతున్నాయి. SRH ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడగా.. మూడింటిలో గెలిచి.. ఐదింట్లో ఓటమి పాలైంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో ప్రతీ మ్యాచ్‌లోనూ రాణిస్తున్నా.. మిడిల్ ఆర్డర్ విఫలం అవుతుండటం ఆ జట్టును ఇబ్బంది కలిగించే అంశం. మనీష్ పాండే భారీ స్కోర్లు చేయలేకపోతుండటం.. భువనేశ్వర్ టోర్నీ నుంచి తప్పుకోవడం వారికి మైనస్‌గా మారింది.

అటు కేకేఆర్ టీం ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లు గెలిచి.. నాలుగింటిలో ఓడిపోయింది. ఈ టీం మిడిల్ ఆర్డర్ కూడా సరిగ్గా రాణించకపోవడం, రసెల్ మెరుపులు.. ఓపెనర్లు స్లో స్టార్ట్.. ఈ జట్టును ఇబ్బంది పెడుతోంది. అయితే తొందర్లోనే నరైన జట్టులోకి చేరడం ఆ టీం ప్లస్ పాయింట్. ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.

హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), బెయిర్‌స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియం గార్గ్, విజయ్ శంకర్, సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, నటరాజన్, తంపి

కోల్‌కతా: రాహుల్ త్రిపాఠి, గిల్, నితీష్ రానా, దినేష్ కార్తీక్, మోర్గాన్(కెప్టెన్), రసెల్, కమిన్స్, శివమ్ మావి, కులదీప్ యాదవ్, ఫెర్గుసన్, వరుణ్ చక్రవర్తి