IPL 2020 : ఓటమి అనంతరం‌ కోహ్లీ ఎమోషనల్‌ ట్వీట్‌

|

Nov 07, 2020 | 5:58 PM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పరాజయం అనంతరం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించాడు.

IPL 2020 : ఓటమి అనంతరం‌ కోహ్లీ ఎమోషనల్‌ ట్వీట్‌
Follow us on

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పరాజయం అనంతరం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించాడు. భావోద్వేగ సందేశంతో పాటు టీమ్ మేట్స్, సహాయక సిబ్బందితో కూడిన గ్రూప్‌ ఫొటోను షేర్‌ చేశాడు.

‘ప్రయాణంలో ఎత్తు పల్లాలు ఎదురైనా సమిష్టిగా ముందుకు వెళ్లాం. ఒక టీమ్‌గా మాకు ఇదొక అద్బుత ప్రయాణం. మేం అనుకున్న విధంగా రిజల్ట్  రాలేదు. కానీ టీమ్ మేట్స్ ప్రదర్శనపై గర్వంగా ఉంది. మద్దతుగా నిలిచిన అభిమానులందరి ధన్యవాదాలు. మీ ప్రేమ మమ్మల్ని మరింత ధృఢంగా మారేలా చేస్తుంది. త్వరలోనే మళ్లీ కలుద్దాం!’ అంటూ కోహ్లీ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

కీలక మ్యాచ్‌లో రాణించకపోవడంతో కోహ్లీపై సోషల్‌మీడియాలో భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ వల్ల టీమ్‌ టైటిల్‌ నెగ్గలేకపోతుందని, జట్టు కెప్టెన్  బాధ్యతల నుంచి తప్పుకోవాలని బెంగళూరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు . ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన విరాట్‌ కోహ్లీ (6) రెండో ఓవర్‌లోనే ఔటయిన విషయం తెలిసిందే.

Also Read :

అజయ్ దేవగణ్ దర్శకత్వంలో అమితాబ్

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు