Breaking News
  • కర్నూలు: సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేష్‌ మధ్య ఆకసక్తికర చర్చ. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందన్న టీజీ వెంకటేష్‌. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరాం. నివేదిక కూడా పంపించామన్న సీఎం జగన్‌. త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చన్న టీజీ వెంకటేష్‌. హైకోర్టు ప్రకటనపై జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీజీ వెంకటేష్‌.
  • ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటి. చంద్రబాబు పర్యటనతో వైసీపీ ఉలిక్కి పడుతోంది-కూన రవికుమార్‌. మంత్రి బొత్స నోటిని అదుపులో పెట్టుకోవాలి-కూన రవికుమార్‌. విశాఖలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. జగన్‌ను విశాఖ ప్రజలు తరిమికొట్టాలి-టీడీపీ నేత కూన రవికుమార్‌.
  • గోపన్‌పల్లి అక్రమ భూమ్యుటేషన్లపై విచారణకు ఆదేశం. విచారణాధికారిగా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ నియామకం. సర్వే నెంబర్‌ 127, 128లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూదందాపై.. విచారణ చేయనున్న రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ. బాధితులను విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. అక్రమ భూమ్యుటేషన్ల వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర. రిటైర్డ్ తహశీల్దార్లు సుబ్బారావు, రాజేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తింపు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసిన కలెక్టర్‌.
  • ఢిల్లీ: పూసాలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం. పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌గోయల్‌. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-20 వార్షిక నివేదిక విడుదల.
  • హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిని అరెస్ట్‌. నారాయణగూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు.

ఈ సుంకాలు తగ్గించాల్సిందే: భారత్‌కు ట్రంప్ హితవు

Donald Trump, ఈ సుంకాలు తగ్గించాల్సిందే: భారత్‌కు ట్రంప్ హితవు

అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోన్న వస్తువులపై భారత్ అత్యధికంగా సుంకాలను(టారిఫ్‌) పెంచడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం తమకు ఆమోదం కాదని.. దీనిని ఉపసంహరించుకోవాలని ఆయన ప్రధాని మోదీకి సూచించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసిన ట్రంప్.. ‘‘భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటోన్న వస్తువులపై ఆ దేశం అత్యధిక సుంకాలను విధిస్తోంది. ఇటీవల కాలంలో ఇవి మరింత పెరిగాయి. ఇది ఎంత మాత్రం ఆమోదం కాదు. దీనిని భారత్ ఉపసంహరించుకోవాలి. ఈ విషయంపై నేను భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తాను’’ అని ఆయన అన్నారు.

కాగా జీ20 సమావేశాల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జపాన్‌కు బయలుదేరి వెళ్లారు. ఇక ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని ఒసాకాకు చేరుకున్నారు. ఈ ఇద్దరు శుక్రవారం భేటీ అవ్వనున్నట్ల తెలుస్తోంది. కాగా బుధవారం భారత్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో భేటీ అయిన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య హద్దులు చెరిపివేయాలని కోరారు. భారత్- అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇది మరింత దోహద పడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ నెలారంభంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న 28 వస్తువులపై భారత్ కస్టమ్ సుంకాలను పెంచింది. వాణిజ్యపరమైన రాయితీలకు తాము స్వస్తి చెబుతున్నామంటూ ట్రంప్ జూన్ 1న ప్రకటించడంతో.. ఇందుకు ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వస్తువుల్లో ఆల్మండ్స్, ఆపిల్స్, పల్సెస్, వాల్‌నట్స్ వంటివి ఉన్నాయి. మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ట్రంప్‌తో సమావేశం కావడం ఇదే మొదటిసారి.

Related Tags