Breaking News
  • వెదర్ రిపోర్ట్: తెలంగాణలో ఈరోజు, రేపు అతి భారీ వర్షాలు. ఉత్తర కోస్తా ఒరిస్సా, గ్యాంగేటిక్ పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం. భారతదేశం మీదుగా 5.8కి.మీ నుంచి 7.6 కి.మీ మధ్య ఏర్పడిన తూర్పు- పశ్చిమ shear జోన్. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు. ఈరోజు, రేపు ఆదిలాబాద్, నిర్మల్ ,కొమురం భీం- ఆసిఫాబాద్ ,మంచిర్యాల, నిజామాబాద్ ,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ ,జయశంకర్ భూపాలపల్లి ,ములుగు, వరంగల్ పట్టణ, గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ ,సూర్యాపేట జిల్లాలో భారీ అతి భారీ వర్షాలు. -వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు.
  • అమీన్ పూర్ కేసును పర్యవేక్షించాలని ఉమెన్స్ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీజీ స్వాతి లాక్ర కు డిజిపి అదేశం. కేసు విచారణ కొరకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశం. కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న డీజీపీ మహేందర్ రెడ్డి. కేసు నమోదు అయినప్పటి నుంచి నిందితుల అరెస్ట్ వరకు వివరాలు తేప్పించుకున్న స్వాతి లక్రా. ఉమెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి ప్రత్యేక అధికారిని నియమించిన స్వాతి లక్రా. నిందితుల అరెస్టు, trails, కేసు విచారణ వరకు ప్రత్యేక దృష్టి పెట్టి నున్న స్వాతి లక్రా.
  • నల్గొండ ఎస్పీ రంగనాథ్ కు డీఐజి గా పదోన్నతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు . డీఐజి హోదాలో నల్గొండ ఎస్పీ గా పనిచేయనున్న రంగనాథ్.
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజి కి భారీగా వరద నీరు. 70 గేట్లు అడుగు మేర ఎత్తివేత. ప్రకాశం బ్యారేజి కి ఇన్ ఫ్లో 70 వేల క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 50750 క్యూసెక్కులు.. తాగు సాగు నీరు కోసం 10800 క్యూసెక్కులు ఈస్ట్ కెనాల్, వెస్ట్ కెనాల్ ద్వారా విడుదల. రెండు రోజుకు పాటు వరద ప్రవాహం ఉంటుందని అంటున్న అధికారులు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
  • తిరుపతి: కరోనా తో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసిన ఎమ్మెల్యే. గోవిందదామంలో దహనక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష. కోవిడ్ వల్ల చనిపోయిన వారికి వైరస్ 6 గంటల పైనే ఉండదని ప్రజలకి అవగాహన కల్పించెందుకు ఇలా అంత్యక్రియలు చేశామన్న ఎమ్మెల్యే. కరోనా వైరస్ తో చనిపోయిన వారు దహన క్రియలకు కుటుంబ సభ్యులు రాకపోవడం చాలా బాధించిందన్న ఎమ్మెల్యే.
  • విజయవాడ రమేష్ ఆసుపత్రికోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద ఘటనలో ముగిసిన డాక్టర్ మమత విచారణ ఆరుగంటలపాటు పలు ప్రశ్నలపై డాక్టర్ మమతను ప్రశ్నించిన ఏసీపీ సూర్యచంద్రరావు మృతుల బంధువుల ఆరోపణల పై డాక్టర్ మమత నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కోవిడ్ కేర్ సెంటర్ లో రమేష్ ఆసుపత్రి వసూలు చేస్తున్న ఫీజులపై వాస్తవాలు రాబట్టే ప్రయత్నం చేసిన పోలీసులు నోటీసులు ఇవ్వటం తో విచారణకు హాజరు అయ్యాను -డాక్టర్ మమత పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను -డాక్టర్ మమత నన్ను పోలీసులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు -డాక్టర్ మమత

గుడ్ న్యూస్: త్వరలో దేశీయ న్యుమోనియా వ్యాక్సిన్

న్యుమోనియాకు వ్యతిరేకంగా దేశంలో మొట్టమొదటి స్వదేశీ అభివృద్ధి చెందిన వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుండి అనుమతి లభించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
India's 1st Homemade Pneumonia Vaccine Gets Regulator Green Light, గుడ్ న్యూస్: త్వరలో దేశీయ న్యుమోనియా వ్యాక్సిన్

న్యుమోనియాకు వ్యతిరేకంగా దేశంలో మొట్టమొదటి స్వదేశీ అభివృద్ధి చెందిన వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుండి అనుమతి లభించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.

ఎంతమంది చిన్నారులను పొట్టన బెట్టుకున్న న్యూమోనియాకు పూర్తిస్థాయి స్వదేశీ వ్యాక్సిన్ పుణెకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. వ్యాక్సిన్ కోసం నియమించిన స్పెషల్ ఎక్స్‌పర్ట్ కమిటీ సహాయంతో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు కేంద్రం ప్రకటించింది. పూణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సమర్పించిన మొదటి, రెండోవ, మూడో దశ క్లినికల్ ట్రయల్ డేటాను సమీక్షించించిన అనంతరం డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. త్వరలోనే న్యుమోకాకల్ పాలిసాకరైడ్ కంజుగేట్ వ్యాక్సిన్‌ను దేశ వ్యాప్తంగా మార్కెట్ లోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా శిశువులలో ‘స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా’ వల్ల కలిగే ఇన్వాసివ్ డిసీజ్, న్యుమోనియాకు వ్యతిరేకంగా క్రియాశీల రోగనిరోధక శక్తి కోసం ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదిలావుంటే ప్రపంచం వ్యాప్తంగా చిన్నారులను న్యుమోనియా కబళిస్తోంది. 2018 లెక్కల ప్రకారం ఒక గంటకు 14 మందికిపైగా ఐదు ఏళ్ల లోపు చిన్నారులు న్యూమోనియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానంలో నిలిచిందని ఓ అధ్యయనం వెల్లడైంది. న్యుమోనియా కారణంగా ప్రతి నాలుగు నిమిషాలకు ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ఒకరు మరణిస్తున్నారు. దీనికి పోషకాహారలోపం, కాలుష్యం కూడా తోడ్పడున్నాయని అధ్యయనంలో తేలింది. ఈ వ్యాధి కారణంగా చిన్నారులు మృత్యువాత పడుతున్న దేశాల్లో నైజీరియా మొదటి స్థానంలో కొనసాగుతుండగా, భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో పాకిస్తాన్‌, కాంగో, ఇథోపియా దేశాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయని అధ్యయనం తెలిపింది.

ఇంతలా బాధించిన న్యూమోనియా నుంచి విముక్తి కలిగిస్తూ మన శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. న్యూమోనియా వ్యాక్సిన్ కోసం పుణేకు చెందిన భారతీయ శాస్త్రవేత్త సుదీర్ఘంగా అధ్యయనం చేశారని కేంద్రం మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకాను మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మొదట DCGI అనుమతి పొందింది. అప్పటి నుండి ఈ ప్రయత్నాలు దేశంలోనే ముగిశాయి. ఈ సంస్థ గాంబియాలో కూడా క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించింది. అయితే, ఈ వ్యాక్సిన్ ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతరం టీకా తయారీకి కోసం సంస్థ దరఖాస్తు చేసిందని వెల్లడించారు.

ఈ వ్యాక్సిన్‌కు మార్కెట్ అధికారం అనుమతి ఇవ్వడానికి ప్రత్యేక నిపుణుల కమిటీ (ఎస్‌ఇసి) సిఫారసు చేసింది. దేశీయంగా అభివృద్ధి చెందిన మొట్టమొదటి న్యుమోకాకల్ పాలిసాకరైడ్ కంజుగేట్ వ్యాక్సిన్ తయారీకి జూలై 14 న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి లభించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు విదేశాల టీకాలపై భారత్ ఆధారపడుతూ వస్తుంది. న్యుమోనియా రంగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి వ్యాక్సిన్ కావడంతో విదేశీయంగా కూడా మంచి డిమాండ్ ఉంటుందని కేంద్రం భావిస్తోంది.

Related Tags