స్మార్ట్‌ఫోన్ సేల్స్ అదరహో.. రెండవ స్థానంలో భారత్!

ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వార్షిక స్థాయిలో తొలిసారిగా అమెరికాను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. 2019లో ఎనిమిది శాతం వృద్ధితో 153 మిలియన్ ఎగుమతులకు చేరుకుంది. 2019లో షియోమి 28 శాతం మార్కెట్ వాటాతో టాప్ ప్లేయర్‌గా కొనసాగుతుండగా, శామ్‌సంగ్ 21 శాతంతో రెండో స్థానంలో, వివో 16 శాతం మార్కెట్ వాటాతో ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ‘మార్కెట్ మానిటర్’ తాజా నివేదికలో పేర్కొంది. చైనా బ్రాండ్ల వాటా […]

స్మార్ట్‌ఫోన్ సేల్స్ అదరహో.. రెండవ స్థానంలో భారత్!
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 08, 2020 | 3:32 PM

ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వార్షిక స్థాయిలో తొలిసారిగా అమెరికాను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. 2019లో ఎనిమిది శాతం వృద్ధితో 153 మిలియన్ ఎగుమతులకు చేరుకుంది. 2019లో షియోమి 28 శాతం మార్కెట్ వాటాతో టాప్ ప్లేయర్‌గా కొనసాగుతుండగా, శామ్‌సంగ్ 21 శాతంతో రెండో స్థానంలో, వివో 16 శాతం మార్కెట్ వాటాతో ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ‘మార్కెట్ మానిటర్’ తాజా నివేదికలో పేర్కొంది.

చైనా బ్రాండ్ల వాటా 2019 సంవత్సరానికి 72 శాతానికి చేరుకుంది, ఇది గత ఏడాది 60 శాతం ఉంది. “ఈ సంవత్సరం, అన్ని ప్రధాన చైనా మోడళ్ళు షియోమి, రియల్‌మీ, వన్‌ప్లస్ తమ ఆఫ్‌లైన్ అమ్మకాల పాయింట్లను పెంచగా, వివో వంటి బ్రాండ్లు తమ ఆన్‌లైన్ పరిధిని విస్తరించాయి. గత నాలుగు సంవత్సరాల్లో షియోమి, వివో, వన్‌ప్లస్ అమ్మకాలు వరుసగా 15 రెట్లు, 24 రెట్లు, 18 రెట్లు పెరిగాయి. శామ్‌సంగ్ ఎగుమతులు 2019 లో దాదాపు ఐదు శాతం క్షీణించాయి.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే వృద్ధిని నమోదు చేయగా, ఫీచర్ ఫోన్ మార్కెట్ 2019లో దాదాపు 42 శాతం క్షీణించింది. కాగా.. 2019 ఆఖరి త్రైమాసికంలో ఐటెల్ నంబర్ వన్ ఫీచర్ ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది, తరువాత శామ్‌సంగ్ మరియు లావా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ లపై అందిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు, కంప్లీట్‌ ప్రొటెక్షన్‌ ఆఫర్స్‌, బైబ్యాక్‌, ఎక్ఛేంజ్‌ ఆఫర్స్‌, నో కాస్ట్‌ ఈఎంఐ లాంటి సదుపాయాలతో ఆన్‌లైన్‌ విక్రయాలు 2019లో 41.7 శాతం పెరిగాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో