రైలు కూతకు ‘ ప్రయివేటు వాత ‘ ! ఇక చార్జీల మోత ?

రైల్వేల ప్రయివేటీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మొదట 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను ప్రయివేటు ఆపరేటర్లకు అప్పగిస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. తొలుత వీటి కార్యకలాపాల బదలాయింపు కోసం ఓ బ్లూ ప్రింట్ ముసాయిదాను రూపొందించడానికి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలన్నది తాజా నిర్ణయం. నిర్దిష్ట కాలబధ్ధ వ్యవధిలో ఈ ప్రక్రియను మొదలుపెట్టేందుకు ఒక సాధికారిక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్.. రైల్వే బోర్డు […]

రైలు కూతకు ' ప్రయివేటు వాత ' ! ఇక చార్జీల మోత ?
Follow us

|

Updated on: Oct 16, 2019 | 4:52 PM

రైల్వేల ప్రయివేటీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మొదట 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను ప్రయివేటు ఆపరేటర్లకు అప్పగిస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. తొలుత వీటి కార్యకలాపాల బదలాయింపు కోసం ఓ బ్లూ ప్రింట్ ముసాయిదాను రూపొందించడానికి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలన్నది తాజా నిర్ణయం. నిర్దిష్ట కాలబధ్ధ వ్యవధిలో ఈ ప్రక్రియను మొదలుపెట్టేందుకు ఒక సాధికారిక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్.. రైల్వే బోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ కు రాసిన లేఖలో తెలిపారు. ఈ కమిటీలో తాను, యాదవ్ తో బాటు ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, హౌసింగ్ అర్బన్ ఎఫైర్స్ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. కనీసం 50 రైల్వే స్టేషన్లను ప్రయివేటీకరించే విషయమై తాను రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ తో మాట్లాడినట్టు ఆయన వెల్లడించారు. ప్యాసింజర్ ట్రైన్ ఆపరేషన్స్ కోసం ప్రయివేట్ ట్రైన్ ఆపరేటర్లను రంగంలోకి దించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందని కూడా ఆయన అన్నారు.

మొదటి దశలో 150 రైళ్లను ప్రయివేటీకరించే యోచన ఉంది. ఈ నెల 4 న లక్నో-ఢిల్లీ మధ్య నడిచే తేజాస్ ఎక్స్ ప్రెస్ ను నాన్-రైల్వే ఆపరేటర్ తో నడిపించడం ఇందులో భాగం.. అన్నారాయన. అయితే ప్రభుత్వ ప్రతిపాదనకు నిరసనగా ఆలిండియా రైల్వేమెన్ ఫెడరేషన్ నిరవధిక సమ్మెకు దిగాలని యోచిస్తోంది. సంఘ్ పరివార్ మద్దతునిస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్ వంటి వివిధ యూనియన్లు ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్నాయి. 2013, 2016 సంవత్సరాల్లో రైల్వే ఉద్యోగులు సమ్మెకు వెళ్లారు. అయితే 45 ఏళ్ళ క్రితం.. 1974 లో నిరవధిక సమ్మె జరిగింది. రైల్వేని ప్రయివేటీకరిస్తే రైలు ప్రయాణికుల చార్జీలతో బాటు రవాణా చార్జీలు కూడా విపరీతంగా పెరుగుతాయని, శాశ్వత ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గిస్తారని ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ప్రెసిడెంట్ సంతోష్ రాయ్ అంటున్నారు.

ఇప్పటికే 16 లక్షల శాశ్వత రైల్వే సిబ్బంది సంఖ్య 11 లక్షలకు తగ్గిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ.. దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన.. రైల్వేని ప్రయివేటీకరిస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ శాఖకు పెద్దగా నష్టాలు లేవని, ఇంధన ధరలు పెరుగుతున్నదృష్ట్యా .. రైల్వే ప్రయివేటీకరణ తప్పదన్న ప్రభుత్వ వాదన అర్థ రహితమని వారు అంటున్నారు. పైగా పార్లమెంట్ లో.. రైల్వే బడ్జెట్ సమర్పణ సందర్భంలో ప్రభుత్వం ఎక్కడా ఈ అంశాన్ని ప్రస్తావించలేదని వారు పేర్కొన్నారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో