2020లో జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాలు.. ఎత్తులకు పైఎత్తులతో మారిన జాతీయ ముఖచిత్రం..

కొత్త సంవత్సరం.. కోటి ఆశలు, కొత్త ఆశయాలతో ఈ ఏడాదికి ప్రపంచం మొత్తం స్వాగతం పలికింది. కానీ అనూహ్యంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇచ్చింది.

2020లో జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాలు.. ఎత్తులకు పైఎత్తులతో మారిన జాతీయ ముఖచిత్రం..
Politics
Follow us

|

Updated on: Dec 31, 2020 | 3:06 AM

కొత్త సంవత్సరం.. కొత్త దశాబ్దిలోకి అడుగిడుతున్న సంబరం.. కోటి ఆశలు, కొత్త ఆశయాలతో ఈ ఏడాదికి ప్రపంచం మొత్తం స్వాగతం పలికింది. కానీ అనూహ్యంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇచ్చింది. ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్‌.. జన జీవనాన్నే స్తంభింపజేసింది. ప్రపంచదేశాలన్నీ చిగురుటాకుల్లా వణికిపోయాయి. వ్యక్తులు, రంగాలు, వ్యవస్థలు ఇలా ఒక్కటేమిటి.. ఒక్కరేమిటి ప్రతి ఒక్కరూ 2020 సంవత్సరానికి, కరోనా దెబ్బకు బాధితులే.. చాలా మందికి ఈ సంవత్సరం చాలా పాఠాలు నేర్పింది. కాగా, 2020లో జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాలు ఏంటి? ఇక్కడి వ్యవస్థలు ఎలా మారాయి అనే విషయాలపై ఓ రౌండప్‌ చూద్దాం…

2021కి ఘన స్వాగతం పలకబోతున్నాం. పాత సంవత్సరంలో మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే.. కొత్త లక్ష్యాలను సిద్ధం చేసుకుంటున్నాం. అయితే, ఈ 2020 ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చారిత్రక విశేషాలకు సాక్ష్యంగా నిలిచింది. మరి కొద్ది గంటల్లో ఈ క్యాలెండర్ మారిపోబోతోంది. ఇదే క్రమంలో గతంలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం..

రాజకీయాలంటేనే ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలు, షాకింగ్ నిర్ణయాలు, కుట్రలు, కుతంత్రాలు. మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన, ఎన్‌సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీలో భాగంగా సాగుతోంది కాంగ్రెస్. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎసరుపెట్టేందుకు బీజేపీ నేతలు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. సిద్ధాంత వైరుధ్యం గల శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీలు జట్టుకట్టడం ఏమాత్రం జీర్ణించుకులేకపోతున్న ప్రతిపక్ష బీజేపీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇ‍ప్పటికే ప్రణాళికలు రచించింది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో దీన్నే సాకుగా చూపుతూ ఉద్దవ్ సర్కార్‌ను కూల్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వైరస్‌ కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రంగా విఫలమయ్యారని వెంటనే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం కూడా ఉద్దవ్ సర్కార్‌ను కాస్త ఇరకాటంలోకి నెట్టింది. సుశాంత్ మరణం వెనకాల ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ బాలీవుడ్ నటి కంగనా సంచలన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. దీనిపై కేంద్ర బీజేపీ సర్కార్ సీబీఐ దర్యాప్తుకు సైతం సిద్దపడింది. జమ్ము-కశ్మీర్ ఎన్నికలు జరపాలని, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్లు పెరుగాయి.370 అర్టికల్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండే నేతలను అదుపులోకి తీసుకుని వారిని నిర్బంధంలో ఉంచారు. కఠిన లాక్‌డౌన్ అమలు చేశారు.ఆగస్టు తర్వాత జమ్ము-కశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. దానిని దిల్లీ నుంచి నియమించిన ప్రతినిధి పాలిస్తున్నారు. అసెంబ్లీ ఉనికిలో లేకపోవడంతో అక్కడ రాజకీయాలకు ఎలాంటి కేంద్రం లేకుండా పోయింది. జమ్మూకశ్మీర్​కు స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలు ఎన్నికల కమిషన్ డిసెంబర్ 23న వెల్లడించింది. మొత్తం 20 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 14 చొప్పున 280 సీట్లకు 8 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పీఏజీడీ(గుప్కార్ కూటమి) 110 స్థానాల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటర్లు మరోసారి పట్టం కట్టారు. 22 ఏళ్ల తర్వాత తిరిగి హస్తిన పీఠాన్ని దక్కించుకోడానికి కమలనాథులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వరుసగా ఐదుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పలేదు. 1998 తర్వాత ఢిల్లీలో అధికారం కోల్పోయిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో పరాజయం చవిచూసింది. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏకు సంపూర్ణ ఆధిక్యం లభించింది. బీజేపీ మిత్ర పక్షాలకు 125 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 122 సీట్లు సరిపోతాయి. అయితే, అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆర్జేడీ – 75, బీజేపీ – 74,జేడీయూ – 43, కాంగ్రెస్ – 19, సీపీఐ(ఎంఎల్) – 12, హెచ్‌ఏఎం – 4, ఎంఐఎం – 5, సీపీఎం – 2, సీపీఐ – 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఎడారి రాష్ట్రంలో ఈ ఏడాది రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీలోకి జంప్ చేసి సీఎం కుర్చీలో కూర్చుందామనుకున్నారు. పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్‌ పైలట్‌ను అధిష్టానం నచ్చజెప్పడంతో టీకప్పులో తుఫాన్‌గా మారిపోయింది. 30 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని, గహ్లోత్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న పైలట్.. ‌ అధిష్టానం చొరవతో మనసు మార్చుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి గహ్లోత్‌, పైలట్‌ మధ్య రాజీ ఫార్ములాను ముందుకు తెచ్చారు. దీంతో పైలట్‌ పలు డిమాండ్లను పార్టీ ముందుంచారు. పార్టీ చీఫ్‌గా తనను కొనసాగించడంతో పాటు తన వర్గానికి నాలుగు మంత్రి పదవులతో పాటు కీలక ఆర్థిక, హోంశాఖలను కట్టబెట్టాలని కోరారు. దీనిపై పార్టీ నేతలు ఇరు వర్గాల నేతలకు సర్థిచెప్పింది.

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరడం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆయనతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడటంతో కమల్‌నాథ్‌ సర్కార్‌ పడిపోయింది. అనంతరం శాసనసభలో సంఖ్యాబలం పూర్తిగా తగ్గిపోవడంతో బీజేపీ సీనియర్‌ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్‌ నాయకుడు కమల్‌నాథ్‌ రాజీనామా చేయక తప్పలేదు. ఆరుగురు మంత్రులతో పాటు మొత్తం 22 మంది సభ్యులు తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది. శాసనసభలోని కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 92కు తగ్గిపోయింది.. మెజారిటీ పొందడానికి 104 మంది సభ్యులు అవసరం కాగా, బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నారు. మార్చి 16వ తేదీనే కమల్‌నాథ్‌ అసెంబ్లీలో బల నిరూపణకు దిగాల్సివచ్చింది. అనంతరం కరోనా ప్రభావంతో రాజకీయాలు శరవేగంగా మారి కమల్‌నాథ్ సీఎం పీఠం నుంచి తప్పుకోవల్సి వచ్చింది. అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం విషయంలో యూటర్న్ తీసుకోవడంతో తెరపైకి ఇతర స్టార్ల పేర్లు వచ్చాయి. తాజాగా హీరో విజయ్‌ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన త్వరలోనే పార్టీ ప్రకటిస్తారని తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆయన ముఖ్యమంత్రి పళనిస్వామితో భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

కర్ణాటక రాజకీయలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పను పదవికే ఎసరు వచ్చింది. ఐటీ పార్కుల కోసం కేటాయించిన 4 ఎకరాలకు పైగా భూమిని డీనోటిఫై చేసి.. గృహ నిర్మాణ అవసరాలకు మళ్లించడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని, దానిపై దర్యాప్తు జరిపించాలంటూ 2013లో లోకాయుక్త ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలని సీఎం యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేయడంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. డిసెంబర్ 15న కర్ణాటక శాసన మండలిలో పలువురు కాంగ్రెస్ సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ధర్మేగౌడను కుర్చీలో నుంచి లాగేశారు. కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. కేరళలో రాజకీయల్లో బంగారం అక్రమ రవాణా కేసు పెద్ద దుమారమే రేపింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల బంగారాన్ని గత శనివారం తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.డిప్లమాటిక్ కార్గో ద్వారా యూఏఈ కాన్సులేట్ చిరునామాతో ఈ బంగారం రావడంతో వ్యవస్థీకృత స్మగ్లింగ్ వ్యవహారం జాతీయ భద్రతకు తీవ్రమైన విఘాతం కలిగిస్తుందని పేర్కొంటూ హోం శాఖ పేర్కొంది. ఈ కేసులో కేరళ ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన వ్యక్తులు బయటకు వచ్చారు. ఇందుకు సంబంధించి సీఎం విజయన్ కార్యదర్శి ఒకరికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు అరెస్ట్ చేశారు.

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఉహించిన దానికంటే వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. బెంగాల్ సివంగి’గా పేరు తెచ్చుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ కెరియర్‌లోనే అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కోంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ వైపు నుంచి వస్తున్న సవాళ్లు, పార్టీలో వరుసగా తిరుగుబాటు పెరుగుతున్నాయి. టీఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రలు, ముఖ్యనేతలు కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ నేతలు మమతానే లక్ష్యంగా రాజకీయ ఎత్తులతో చిత్తు చేస్తున్నారు. ఇటీవల వరకూ ప్రభుత్వంలో, పార్టీలో ఎవరి మాటను వేదవాక్కుగా భావిస్తూ వచ్చారో, ఆమెకు వ్యతిరేకంగా పదుల సంఖ్యలో నేతలు ఇప్పుడు గళం వినిపిస్తున్నారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో