చైనా ‘కండకావరానికి’ లొంగబోం… రాజ్ నాథ్ సింగ్.. అమిత్ షా

లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న చైనా కండకావరానికి లొంగే ప్రసక్తే లేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. భద్రతా వ్యవహారాలపై..

చైనా 'కండకావరానికి' లొంగబోం... రాజ్ నాథ్ సింగ్.. అమిత్ షా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 09, 2020 | 2:51 PM

లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న చైనా కండకావరానికి లొంగే ప్రసక్తే లేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. భద్రతా వ్యవహారాలపై గల కేబినెట్ కమిటీలో సభ్యులైన వీరు.. లడఖ్ సెక్టార్ లో మన దేశానికి చెందిన మరింత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా చేసే ఏ యత్నాన్నయినా అడ్డుకుంటామన్నారు.   . బీజేపీ కార్యకర్తలనుద్దేశించి  వర్చ్యువల్ ర్యాలీలో పాల్గొన్న రాజ్ నాథ్, అమిత్ షా.. భారత జాతి ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పణంగా పెట్టబోమని చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ మాదిరే  తన భూభాగాన్ని కాపాడుకునేందుకు ముందే దాడి చేసే సామర్థ్యం ఇండియాకు ఉందని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని యూరి, పుల్వామా ప్రాంతాల్లో పాకిస్తాన్ ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం పాక్ భూభాగంలో దాడులు చేసిందని ఆయన గుర్తు చేశారు. సర్జికల్ దాడుల గురించి కూడా ప్రస్తావించారు. అటు.. చైనాతో సైనిక, దౌత్య స్థాయుల్లో ఇండియా చర్చలు జరుపుతోందని, ఈ నెల 6న సైనిక స్థాయిలో జరిగిన చర్చలు సానుకూల ఫలితాలనిచ్చాయని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. అవసరమైతే చైనాకు గట్టి గుణపాఠం చెప్పగల సామర్థ్యం ఇండియాకు ఉందన్నారు.