ట్రంప్ ఎఫెక్ట్: 311 మంది భారతీయులకు మెక్సికో షాక్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మెక్సీకోలోని భారతీయులకు షాక్ ఇచ్చాడు. తన కఠిన నిర్ణయాలతో వేలాది మంది భారతీయులను ఇబ్బందులకు గురి చేసిన ట్రంప్.. తాజాగా మెక్సికోలో నివశిస్తున్న భారతీయులపై కన్నేశాడు. మెక్సీకోలో నివశిస్తున్న భారత్‌కు చెందిన 311 మంది అక్రమ వలసదారులను ఆ దేశం తిరిగి వెనక్కు పంపి వేసింది. అమెరికా నుంచి ఎదురవుతున్న ఒత్తిడి కారణంగా మెక్సికో ప్రభుత్వం దేశవ్యాప్తంగా అక్రమవలసదారులను గుర్తించేందుకు తనిఖీ చేపట్టింది. ఈ క్రమంలో చట్టబద్ధంగా దేశంలో ఉండటానికి అర్హత లేని […]

ట్రంప్ ఎఫెక్ట్: 311 మంది భారతీయులకు మెక్సికో షాక్
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 1:51 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మెక్సీకోలోని భారతీయులకు షాక్ ఇచ్చాడు. తన కఠిన నిర్ణయాలతో వేలాది మంది భారతీయులను ఇబ్బందులకు గురి చేసిన ట్రంప్.. తాజాగా మెక్సికోలో నివశిస్తున్న భారతీయులపై కన్నేశాడు. మెక్సీకోలో నివశిస్తున్న భారత్‌కు చెందిన 311 మంది అక్రమ వలసదారులను ఆ దేశం తిరిగి వెనక్కు పంపి వేసింది. అమెరికా నుంచి ఎదురవుతున్న ఒత్తిడి కారణంగా మెక్సికో ప్రభుత్వం దేశవ్యాప్తంగా అక్రమవలసదారులను గుర్తించేందుకు తనిఖీ చేపట్టింది. ఈ క్రమంలో చట్టబద్ధంగా దేశంలో ఉండటానికి అర్హత లేని భారతీయులను కూడా గుర్తించింది. మెక్సికో సరిహద్దుల ద్వారా.. అమెరికాలోకి ప్రవేశించే భారతీయులకు చెక్ పెట్టకపోతే మెక్సికో నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనివల్ల ఆ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులపై మెక్సికో కొరడా ఘులిపించింది. కాగా, వీరంతా టొలుకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్ 747 ఎయిర్ క్రాఫ్ట్‌లో న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇదిలా వుంటే మరోవైపు అమెరికాలో నివశించేందుకు పలువురు అడ్డదారులను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎంతోమంది అమెరికాలో ఉండాలనే తమ కలను నెరవేర్చుకునేందుకు అంతర్జాతీయ ఏజెంట్ల ద్వారా అక్రమంగా అమెరికా వెళ్లడానికి లక్షల్లో డబ్బులు చెల్లించి మోసపోతున్నారు.